Site icon HashtagU Telugu

Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులు అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Diabetes

Diabetes

అరటి పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. మార్కెట్లో ఏడాది పొడుగునా లభించే ఈ పండ్ల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇకపోతే చాలామంది షుగర్ పేషెంట్లకు అరటి పండ్లు అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ వాటిని తినడానికి కాస్త సంకోచిస్తూ ఉంటారు. అరటి పళ్ళు తింటే షుగర్ పెరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. షుగర్ పేషెంట్లు అరటి పండ్లు తినవచ్చా, తినకూడదా? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అరటిపండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అరటి పండ్లలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ బి 6, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అరటిపండు గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం, మూత్రపిండాల ఆరోగ్యంతో పాటుగా మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా అరటిపండ్లు తినవచ్చట.

ఎందుకంటే అరటిపండ్లను తింటే మీరు ఇతర చెడు ఆహారాలకు దూరంగా ఉంటారట. ఎందుకంటే ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయని చెబుతున్నారు. అలాగే అతిగా తినకుండా చేస్తాయట. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు అరటిపండ్లు తినకపోవడమే మంచిదట. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచే అవకాశముందట.

అరటి పండ్లను ఇతర సమయాల్లో తినవచ్చని చెబుతున్నారు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను మితంగా మాత్రమే తినాలట. డయాబెటిస్ ఉన్నవారు తీపి ఏదైనా తినాలనుకుంటే ధైర్యంగా ఎంచుకునే ఆహారం అరటి పండ్లు. అరటి పండ్లను మితంగా తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందటముఖ్యంగా పండని అరటిపండ్లు టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడానికి బాగా సహాయపడతాయని, బాగా పండిన అరటిపండ్లు తీయగా ఉంటాయి. అందుకే మధుమేహులు కొద్దిగా పండిన అరటిపండును మాత్రమే తినాలని చెబుతున్నారు.