Site icon HashtagU Telugu

Roti: చపాతీలను నేరుగా మంటపై కాల్చుతున్నారా.. అయితే జాగ్రత్త!

Roti

Roti

చపాతీలు.. వీటిని కొంతమంది బ్రేక్ ఫాస్ట్ గా తింటే మరికొందరు లంచ్ సమయంలో ఇంకొందరు డిన్నర్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వీటిని తింటూ ఉంటారు. ముఖ్యంగా రాజస్థాన్, బీహార్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ చపాతీలు అనే తింటూ ఉంటారు. చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఫ్యాషన్ పేరుతో చపాతీలను రకరకాలుగా చేయడం మొదలుపెట్టారు. అందులో చపాతీలను నేరుగా మంటపై కాల్చడం కూడా ఒకటి. పాన్ మీద అటు ఇటు కొద్దిసేపు కాల్చిన తర్వాత నేరుగా చపాతీలు మంటపై పెట్టి కాలుస్తూ ఉంటారు.

ఇటీవల కాలంలో యూట్యూబ్ వంటివి చూసిన తర్వాత చాలామంది ఇలా చేస్తున్నారు. కానీ ఇలా చేయడం అసలు మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయట. ఇవి మానవ శరీరానికి చాలా ప్రమాదం అని చెబుతున్నారు. రోటీలను నేరుగా స్టవ్ పై పెట్టి కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందట. ఎక్కువ మంటపై వంట చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతపై ఉండడం వల్ల క్యాన్సర్ కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌ లు, పాలీ సైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌ లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. నల్లగా మారిన భాగాలలో హానికరమైన కార్బన్ సమ్మేళనాలు ఉండే అవకాశం ఉంది.

వీటి వల్ల శ్వాసకోశ సమస్యలు,గుండె సమ్యలతో పాటు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే జీర్ణ సమస్యలతో అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నేరుగా మంటపై కాల్చిన చపాతీరోడ్లను,రోటిలను తినడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణించి అవకాశం ఉంటుందట. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలాంటి వాటిని తినడానికి ఇష్టపడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. ఉదయం అల్పాహారంగా చపాతీ చేయడానికి తొందరగా పిండిని పిసికి చేసేస్తారు. దీంతో చపాతీ గట్టిపడుతుంది. కనీసం 10 నిమిషాలు పిండిని బాగా కలపాలట. బాగా మెత్తగా కలిపితేనే చపాతీ గుండ్రంగా మెత్తగా వస్తుంది. మిక్సింగ్ తర్వాత వెంటనే చపాతీ చేయవద్దు. పిండిని అరగంట అలాగే ఉంచడం మంచిది. లేదంటే చపాతీ పిండిని రాత్రి కలుపుకుని అలాగే ఉంచి ఉదయాన్నే చపాతీలు సులభంగా చేసుకోవచ్చు. చపాతీలు మెత్తగా రావాలి అనుకున్నవారు చపాతీ కలుపుకునే ముందు చల్ల నీరు కాకుండా గోరువెచ్చని నీరు కలుపుకుంటే చపాతీ మెత్తగా వస్తాయట.