Migraine : చాక్లెట్ తింటే మైగ్రేన్ తలనొప్పి వస్తుందా…ఎంత వరకు నిజం..!!

తలనొప్పిని భరించడం చాలాకష్టం. అందులోనూ ఒకసైడ్ మాత్రమే వచ్చే మైగ్రేన్ తలనొప్పి ఇంకా భయంకరంగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 09:00 AM IST

తలనొప్పిని భరించడం చాలాకష్టం. అందులోనూ ఒకసైడ్ మాత్రమే వచ్చే మైగ్రేన్ తలనొప్పి ఇంకా భయంకరంగా ఉంటుంది. దీనివల్ల ఎన్నోఅనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, అలసట, ఉపవాసం, నిద్రలేకపోవడం, వాతావరణంలో మార్పులు ఇవన్నీ కూడా మైగ్రేన్ కు కారణం కావచ్చు. మైగ్రేన్ బాధితుల్లో దాదాపు 20శాతం మంది ఆహారపు అలవాట్ల వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడ్ వైన్, కాఫీ, చాక్లెట్, చీజ్, సిట్రస్ పండ్లు, త్రుణధాన్యాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మోనోసోడియం గ్లుటామేట్ వంటివి మైగ్రేన్ కు కారణం అవుతాయి.

చాక్లెట్స్ ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. కానీ మైగ్రేన్ తో బాధపడుతున్న వ్యక్తికి ఇది అస్సలు మంచిది కాదంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే చాక్లెట్ లో ఉండే కెఫిన్, బీటా ఫినైలెథైలమైన్ రక్తనాళాలను విస్తరింపజేస్తాయి. దీంతో మైగ్రేన్ నొప్పి రావడం ప్రారంభం అవుతుంది. చాక్లెట్ తిన్నతర్వాత సాధారణంగా 12 నుంచి 24 గంటల తర్వాత మైగ్రెన్ ప్రారంభం అవుతుంది. అయితే చాక్లెట్ కు తలనొప్పికి మధ్య సంబంధాన్ని వెల్లడించనప్పటికీ…మైగ్రేన్ రీసెర్చ్ ఫౌండేషన్ కొన్ని ఆహారా పదార్థాలు ఇతర ట్రిగ్గర్లతో కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే మైగ్రేన్ కు కారణం అవుతుందని పేర్కొంది.

చాక్లెట్ లో చక్కెర, పాలు, కోకో పౌడర్, కోకో బటర్ వంటి పదార్థాలు ఉంటాయి. కోకో బీన్ లో సహజంగా కోకో పౌడర్, కోకో బటర్ ఉంటాయి. వాటిని కలిపితే అవి చాక్లెట్ గా మారుతంది. యాంటీఆక్సిడెంట్, కార్డియోవాస్కులర్, యాంటీ ఇన్ఫ్లమేటర్, మెటబాలిక్ లక్షణాలతో పాటు ఆరోగ్యంపై కోకో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటితోపాటుగా అదనంగా ఇందులో బీటా ఫెనిలేథైలమైన్, కెఫిన్ ఉన్నాయి. ఈ రెండూ కూడా కొంతమందికి తలనొప్పికి కారణంగా కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చాక్లెట్ మాత్రమే కాకుండా ఆల్కాహాల్, ఉపవాసం ఉండటం లేదా అధిక ఒత్తిడి, వాతావరణంలో మార్పులు ఇవన్నీ కూడా మైగ్రేన్ కు కారణం కావచ్చు. ఇవన్నీ కూడా అనారోగ్యకరమైన అలవాట్లు కాబట్టి మైగ్రేన్ దారి తీస్తుందని నిజమైన ఆధారాలు ఉన్నాయి. మీకు చాక్లెట్ తినాలన్న కోరిక ఉన్నట్లయితే డార్క్ చాక్లెట్ తినడం ఉత్తమని పరిశోధకులు చెబుతున్నారు.