Site icon HashtagU Telugu

Banana: అరటిపండుతో బీపీని తగ్గించుకోవచ్చా.. ఇందులో నిజమెంత?

Banana Benefits

Banana Benefits

అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనకు మార్కెట్లో ఏడాది ఇప్పుడు ఉన్న అత్యంత తక్కువ ధరకే లభించే పంటలు అరటి పండ్లు కూడా ఒకటి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. అరటిపండు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతోపాటు రకాల సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు అరటిపండు తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చుని చెబుతున్నారు.

మరి నిజంగానే అరటిపండుతో అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టవచ్చా? ఈ విషయం గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక రక్తపోటును నియంత్రించడం చాలా కష్టం. దీనివల్ల ఛాతీ నొప్పి, మైకము, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. చాలా సందర్భాల్లో ఈ హైబీపీ వల్ల గుండెపోటు కూడా వస్తుంది. మన ఆహారపు అలవాట్లు, దినచర్య సరిగా లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించి ఈ సమస్యను నియంత్రించొచ్చు. అరటిపండు తినడం వల్ల హైబీపీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల హైబీపీ అదుపులో ఉంటుందట. పొటాషియం రక్తపోటు ప్రభావాలను తగ్గిస్తుందట. కాగా అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుందట. దీనివల్ల హైబీపీ పేషెంట్లకు మంచి మేలు జరుగుతుందట. దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాల గోడలోని ఒత్తిడిని తగ్గిస్తుందట. పొటాషియం రక్త నాళాలను వెడల్పుగా చేయడానికి సహాయపడుతుందని, దీంతో రక్తం సరిగ్గా ప్రవహిస్తుందని, దీంతో అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మీ రక్తపోటు రేటు 120/80 కంటే ఎక్కువగా ఉంటే మీరు ఆహారంలో పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలట. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు.

అలా అని ఎక్కువ పొటాషియాన్ని తీసుకోవడం కూడా అంత మంచిది కాదని చెబుతున్నారు. అరటిపండు తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందట. అలాగే ఇది మలబద్ధకం సమస్యను పోగొడుతుందని, పేగులకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే అరటిపండు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందట. ఎలా అంటే దీన్ని తింటే కడుపు తొందరగా నిండుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. అందుకే ఈ పండును రెగ్యులర్ గా ఒకటి తిన్నా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.