Site icon HashtagU Telugu

Soap Sharing: ఇంట్లో అందరూ ఒకే సబ్బును ఉపయోగించవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Soap Sharing

Soap Sharing

మామూలుగా చాలా వరకు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఒకే సబ్బుని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక సపరేట్ బెడ్ రూమ్ సపరేట్ వాష్రూమ్ లు ఉన్నవారు మాత్రమే సపరేటు సోపులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒకే సబ్బు ఉపయోగించే వారి చర్మ తత్వాలు అందరూ ఒకే విధంగా ఉంటాయా అంటే ఉండవు అని చెప్పవచ్చు. ఒకే సబ్బుతో చాలా మంది స్నానం చేయడం అన్నది హానికరం అంటున్నారు వైద్యులు. మరి ఇంట్లో అందరు ఒకే సబ్బుని ఉపయోగించడం మంచిదో కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో ఉన్న అందరూ ఒకే సబ్బుతో స్నానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఒకరు ఒక సబ్బు వాడాక, ఆ సబ్బుపై కొన్ని రకాల సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉంది. ఈ క్రిములు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఎక్కువ. సబ్బుపై అధికంగా సాల్మొనెల్లా, ఫిగేల్లా వంటి బాక్టీరియాలు, నోరో వైరస్, రోటా వైరస్, స్టాఫ్ వైరస్ వంటి క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఒకరి నుంచి మరొకరికి త్వరగా సోకుతాయి. ఒకరు వాడిన సబ్బును మరొకరు వాడితే ఇలాంటివి వ్యాపించే అవకాశం ఎక్కువ. దీనివల్ల బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారిలో తీవ్రమైన సమస్యలు రావచ్చు. కాబట్టి ఒకరి సబ్బులను మరొకరు ఉపయోగించకపోవడమే మంచిది.

ఇంట్లో అందరు ఒక్కొక్కరూ ఒక్కో సబ్బు వాడడం అన్ని ఇళ్లల్లో జరగదు. ముఖ్యంగా మధ్యతరగతి ,పేద ఇళ్లల్లో ఒక్కొక్కరు ఒక్కో సబ్బు వాడే పరిస్థితి ఉండదు. అలాంటి వారు లిక్విడ్ సోపులను వాడితే మంచిది. లిక్విడ్ సోప్ అనేది చేతికి తగలకుండా, కేవలం ఆ లిక్విడ్‌ని చేతిలో వేసుకొని శరీరానికి రాసుకుంటారు. కాబట్టి ఈ క్రిములు లిక్విడ్ సోప్ ఉన్న డబ్బాపై చేరకుండా ఉంటాయి. సోప్ లోపలికి కూడా వెళ్లలేదు, కాబట్టి లిక్విడ్ సబ్బులను వాడడం అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకు మాత్రం ప్రత్యేకంగా సబ్బును పెట్టడం చాలా ఉత్తమం. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. ఒకరు వాడిన సబ్బులను పిల్లలకు వాడడం వల్ల త్వరగా బ్యాక్టీరియా, వైరస్‌లు వారి చర్మంపై చేరుతాయి. దురద, మంట, దద్దుర్లు వంటి వాటికీ కారణం కావచ్చు. శరీరం లోపలికి చేరితే ప్రమాదకరమైన వ్యాధులను కలిగించవచ్చు.