మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వేసవికాలం కాబట్టి మనకు మార్కెట్లో మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. మామిడిపండ్లలో ఎన్నో రకాల మామిడి పండ్లు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. మామిడిపండు ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే మామిడి పండు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు.
కొంతమంది ఇష్టమైన సరే వీటికి దూరంగా ఉంటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవారు ఈ పండ్లను ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా తినవచ్చట. డయాబెటిస్ ఉన్నవారు ఏదైనా తినడానికి చాలా భయపడిపోతుంటారు. షుగర్ పేషెంట్లు స్టార్చ్ తక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తినాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయట. ఈ పండ్లలో ఐరన్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయట. అయితే మామిడి పండ్లలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు, నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయట.
కాబట్టి ఈ మామిడి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదట. అందుకే డయాబెటిక్ పేషెంట్లు వీలైనంత వరకు మామిడి పండ్లను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదట. మధుమేహులు మామిడి పండ్లతో పాటుగా వేరే కొన్ని పండ్లను కూడా తినకూడదట. అరటి పండ్లు, పైనాపిల్స్ వంటి పండ్లలో కూడా నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయట. వీటిని తింటే కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. అందుకే డయాబెటిక్ పేషెంట్లు వీటిని లిమిట్ లోనే తినాలని చెబుతున్నారు. డయాబెటీస్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లను ఖచ్చితంగా తినాలట. వీటిలో ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఆపిల్, నారింజ, నిమ్మకాయలు, దానిమ్మ, చెర్రీలు, పీచెస్, కివి మొదలైన పండ్లను ఎలాంటి భయం లేకుండా తినవచ్చట.