Site icon HashtagU Telugu

Banana: షుగర్ ఉన్నవారు అరటి పండ్లు తినవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Mixcollage 12 Jul 2024 09 01 Am 747

Mixcollage 12 Jul 2024 09 01 Am 747

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ డయాబెటిస్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వైద్యులు ఎన్ని రకాల సూచనలు ఆరోగ్య జాగ్రత్తలు చెప్పినా కూడా రోజు రోజుకి ఈ షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇకపోతే ఇప్పటికే డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నా కూడా కాస్త భయపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో అరటి పండ్లు కూడా ఒకటి. చాలామందికి అరటి పండ్లు బాగా ఇష్టం అయినప్పటికీ వాటిని తినడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు.

అరటి పండ్లు తింటే షుగర్ పెరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. మరి షుగర్ ఉన్నవారు అరటి పండ్లు తినకూడదా, తింటే ఏం జరుగుతుంది? ఒకవేళ తింటే ఎన్ని అరటి పండ్లు తినవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ ఉన్నవారు ఏవి పడితే అవి తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. ముఖ్యంగా తీపి ఆహారాలను. చాలా మంది డయాబెటీస్ పేషెంట్లకు ఏ ఆహారాలను తినకూడదో తెలియక అయోమయానికి గురవుతుంటారు. అటువంటి వాటిలో అరటి పనులు కూడా ఒకటి. అరటిపండ్లలో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అరటిపండు తీయగా ఉంటుంది.

అందుకే మధుమేహులు వీటికి దూరంగా ఉంటారు. అరటిపండ్లను తింటే డయాబెటీస్ పేషెంట్ల షుగర్ లెవల్స్ త్వరగా పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్ని పండ్లను తక్కువ పరిమాణంలో తినచ్చు. షుగర్ వ్యాధి వారు అరటిపండ్లను కూడా తినవచ్చు. కాకపోతే తక్కువ మొత్తంలో మాత్రమే తినాలి. అరటి డయాబెటీస్ పేషెంట్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అరటిపండ్లు తియ్యగా ఉంటాయి. అలాగే దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మధుమేహులకు ఎలాంటి హాని చేయదు. అరటి పండ్లలో మంచి మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెరగనివ్వదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఒక మీడియం సైజు అరటిపండును తినవచ్చు. అలా అని రోజులో ఎక్కువసార్లు ఎక్కువ మొత్తంలో తింటే మాత్రం సమస్యలు తప్పవు. అయితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉన్నవారు మాత్రమే అరటిపండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైపోగ్లైసీమియాతో బాధపడేవారు అరటిపండ్లకు దూరంగా ఉండటమే మంచిది.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.