Site icon HashtagU Telugu

Caffeine : కెఫీన్ కాఫీలో మాత్రమే కాదు.. మన శరీరంకు ఎంత కెఫీన్ శాతం దాటకూడదు..

Hot Or Iced Coffee

Hot Or Iced Coffee

మనం రోజూ ఉదయం లేవగానే కాఫీ(Coffee), టీ(Tea) వంటివి తాగుతాము. కానీ రోజుకు మనం ఎంత కెఫీన్(Caffeine) ఆహారం రూపంలో తీసుకోవాలో తెలుసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. కెఫీన్ ఉన్న ఆహారపదార్థాలు ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే యూరిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కెఫీన్ ఉన్న పానీయాలు తాగే అలవాటు లేనివారు ఒక్కసారిగా ఎక్కువగా తాగినప్పుడు కూడా వారికి సమస్యలు తలెత్తుతాయి.

కెఫీన్ ఎక్కువగా కాఫీ, టీ లతో పాటు సోడా, ఎనర్జీ డ్రింకులు, హాట్ చాక్లెట్స్ వంటి వాటిలో ఉంటుంది. కెఫీన్ ఉన్న డ్రింకులను తాగేటప్పుడు వాటి లేబుల్ ని పరిశీలించి వాటిలో కెఫీన్ ఎంత శాతం ఉందో తెలుసుకోవచ్చు. చిన్న పిల్లలకు అంటే పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు కెఫీన్ ఉన్న పానీయాలను తాగించకూడదు. పన్నెండు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు రోజుకి వంద మిల్లీగ్రాములు కెఫీన్ అవసరం అవుతుంది. అంతకు మించి కెఫీన్ ఆ వయసు గల పిల్లలకు ఇవ్వకూడదు.

ఇంకా పెద్దవారు రోజుకి నాలుగు వందల మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవడం మంచిది అంతకంటే మించితే మన ఆరోగ్యానికి హానికరం. గర్భవతులు, బాలింతలు కూడా కెఫిన్ ఉన్న పానీయాలు తాగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఒక కప్పు కాఫీలో 80 నుండి వంద మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. శీతల పానీయాలలో నలభై నుండి 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. దీనిని బట్టి మనం ఎలాంటి పానీయాలు తీసుకోవచ్చొ తెలుసుకోవచ్చు.

ఒక కేజీ శరీరబరువుకి పది మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నా వారికి ఎక్కువ మోతాదులో ఉంటుంది. 75 కేజీల బరువు ఉన్న వ్యక్తికి 750 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకుంటే వారికి కెఫిన్ ఎక్కువయ్యి ఛాతిలో నొప్పి, నిద్రలేమి, విరోచనాలు, పొట్టలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడుతాయి. పెద్దవాళ్ళు రోజుకి మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు. అంటే 200 మిల్లీగ్రాముల కెఫీన్ మించకూడదు. కొంతమంది రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు కాఫీ, టీ, డ్రింక్స్ తాగుతారు. అలాంటి వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు.

 

Also Read : Dark Elbows: మోచేతులు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

Exit mobile version