Cabbage Benefits : చలికాలంలో క్యాబేజీ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..

క్యాబేజీ తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 07:00 PM IST

చలికాలంలో(Winter) మనకు ఎక్కువగా లభించే కూరగాయలలో క్యాబేజీ(Cabbage) ఒకటి. క్యాబేజీలో అన్ని రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయి. కొంతమంది క్యాబేజీని వద్దంటారు. కానీ క్యాబేజీ కూర చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజీతో పప్పు, టమాటా క్యాబేజీ, మంచూరియ.. ఇలా రకరకాలుగా వండుకొని తినొచ్చు. క్యాబేజీ తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

* క్యాబేజీ తినడం వలన మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
* క్యాబేజీ తినడం వలన అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
* క్యాబేజీలో ఉండే సల్ఫర్ కంటెంట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది.
* క్యాబేజీలో ఉండే పోషకాలు మనం మానసికంగా బలంగా ఉండడానికి తోడ్పడుతుంది.
* క్యాబేజీలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
* డయాబెటిస్ ఉన్నవారు క్యాబేజీ తినడం వలన ఇది బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది.
* క్యాబేజీ తినడం వలన కంటి శుక్లాలు రావడం తగ్గిస్తుంది.
* క్యాబేజీ తినడం వలన అల్జీమర్స్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
* క్యాబేజీలో ఉండే యాంటి ఆక్సీడెంట్లు వృద్దాప్య లక్షణాలను కలిగించే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
* బాలింతలు క్యాబేజీ తింటే పాలు బాగా పడతాయి.
* క్యాబేజీ ఆకుల రసం తాగితే దగ్గు కూడా తగ్గుతుంది.

 

Also Read : Ragi Malt: రాగి జావ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?