Site icon HashtagU Telugu

Diabetes Diet: షుగర్ వ్యాధిగ్రస్తులు క్యాబేజీ ,కాలిఫ్లవర్ తినకూడదా.. తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా?

Mixcollage 02 Jan 2024 08 10 Pm 9063

Mixcollage 02 Jan 2024 08 10 Pm 9063

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. షుగర్ రావడానికి అనేక కారణాలు ఉండగా అందులో ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు దానిని అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు వంటింటి చిట్కాలను ఉపయోగించి కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ ఉంటారు. అలాగే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు భయపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో క్యాబేజీ కాలిఫ్లవర్ కూడా ఒకటి.

వీటిని తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చాలామంది భయపడుతూ ఉంటారు. మరి నిజంగానే ఈ రెండు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాబేజీ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయనే భయం అక్కర్లేదు. అంతేకాకుండా ఈ కూరగాయలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, కె, కాల్షియం, ఫాస్పరస్ కూడా క్యాబేజీల్లో ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారికి బరువును అదుపులో ఉంచుకోవడం ఒక సవాలుగా మారుతుంది. క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఇది సులువుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మరోవైపు, డయాబెటిస్‌ వల్ల నరాల దెబ్బతినే ప్రమాదం ఉంది. క్యాబేజీలోని విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్లు నరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే విటమిన్ సి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు క్యాబేజీతో చేసిన ఆహారాలను ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ తక్కువ కేలరీల ఆహారాన్ని తినాలని వైద్యులు చెబుతుంటారు. కాలీఫ్లవర్ కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని తినడానికి సంకోచించనవసరం లేదు. కాలీఫ్లవర్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో కొవ్వు ఉండదు. కాబట్టి క్యాలీఫ్లవర్ తినడం వల్ల బరువు పెరుగుతారనే భయం అక్కర్లేదు. మధుమేహం కూడా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. రక్తపోటును సాధారణంగా ఉంచుకోవడానికి కాలీఫ్లవర్ తినవచ్చు. కాలీఫ్లవర్‌లో ఫైబర్‌తో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఈ పదార్ధం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కాలీఫ్లవర్ తినవచ్చు.