Site icon HashtagU Telugu

Rice Water Health Benefits: ప్రతిరోజు గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Rice water

Rice Water Health Benefits

మాములుగా అన్నం వండిన తర్వాత అందులో నుంచి వచ్చే గంజిని పారబోస్తూ ఉంటారు. కానీ రోజుల్లో అన్నం వండిన తర్వాత వచ్చిన గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగుతుండేవాళ్లు. అందుకే వాళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కాలక్రమేనా గంజిని పనికిరానిదిగా భావించి వృథాగా పాడేస్తున్నాేరు. గంజిలో అనేక పోషక విలువులు ఉన్నాయి. గంజిలో బి, ఇ, సి విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. గంజిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గంజి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు అతిసారం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. చిన్న గ్లాసు పలుచటి గంజి తాగితే మీకు ఉపశమనం లభిస్తుంది.

గంజిలోని పిండి పదార్ధం బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ గట్‌ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.​ అనారోగ్యం, తీవ్రమైన శారీరక శ్రమ శరీరాన్ని రీహైడ్రేట్‌ చేయడం చాలా ముఖ్యం. గంజి లోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలో కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను పునరుద్ధరించడానికి గంజి సహాయపడుతుంది. డీహైడ్రేషన్‌, అలసటను నివారిస్తుంది.​ ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలతో సమర్థవంతంగా పోరాడటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ కీలకం. గంజిలో విటమిన్‌ బి, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇస్తాయి.

రోజూ గంజి తాగితే ఇన్పెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. గంజి నెలసరి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. గంజిలోని రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాలను ఉపశమనానికి, ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు నెలసరి నొప్పితో బాధపడుతుంటే ఒక కప్పు గోరువెచ్చని గంజి తాగడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే మంచిది. గంజిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందుకు కారణం దీనిలో ఉండే పీచు పదార్థాలే. ఈ ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.