కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూర్వం నుంచి ఎన్నో రకాల ఔషధాలు తయారీలో కలబందను ఉపయోగిస్తూనే ఉన్నారు. కేవలం ఆరోగ్యపరమైన వాటికి మాత్రమే కాకుండా అందానికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీనిలో కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.
ఉదయం పూట ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి, శరీరాన్ని క్లీన్ చేస్తాయి. శరీరంలో టాక్సిన్స్ తొలగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది, పోషకాలను గ్రహిస్తుంది. దాంతో తొందరగా బరువు తగ్గుతారు. అదేవిధంగా డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కలబందలో లెక్టిన్లు, ఆంత్రాక్వినోన్స్ ఉంటాయి. వీటిలో సహజంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.
రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. షుగర్ పేషెంట్స్ కలబంద జ్యూస్ తాగేముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ప్రీ డయాబెటిస్, టైప్2 డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి కలబంద రసాన్ని సప్లిమెంట్‌గా తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగుపడతాయి. మలబద్ధకంతో బాధపడేవారికి కలబంద ఔషధంలా పనిచేస్తుంది. కలబందలో విటమిన్లు, మినరల్స్, యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా తోడ్పడతాయి. మలాన్ని మృదువుగా చేసి మలబద్ధకానికి చెక్ పెడతాయి. ఇది ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగితే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే మేలు జరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను కలబంద పరిష్కరిస్తుంది. ఉదయాన్నే కొద్ది మొత్తంలో కలబంద రసం తాగితే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వచ్చే ముప్పును తగ్గించవచ్చు.