మజ్జిగ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో మజ్జిగ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. పెరుగు తినడానికి ఇష్టపడని వారిని ఎక్కువగా మజ్జిగ తాగుతూ ఉంటారు. ఇకపోతే మజ్జిగ ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మజ్జిగ తాగకపోవడం మంచిదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు మజ్జిగ తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
లాక్టోస్ అసహనం ఉన్నవారు మజ్జిగ తాగకూడదని చెబుతున్నారు. లాక్టోస్ అసహనం అనేది పాలలో ఉన్న లాక్టోస్ ను శరీరం జీర్ణించుకోలేకుండా చేస్తుందట. లాక్టోస్ అసహనం ఉన్నవారికి వారి శరీరంలో లాక్టోస్ ను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్ లాక్టేజ్ ఉండదట. అలాంటి వారు మజ్జిగ తాగితే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలను రావచ్చని చెబుతున్నారు. కొందరిలో పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవటం వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. పాలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారికి మజ్జిగ తాగడం వల్ల కూడా అలెర్జీ ప్రతిచర్య ఉండవచ్చట. అలాంటి వారికి మజ్జిగ సరిపడదు.
కాబట్టి వీరు మజ్జిగ తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, శ్వాస ఆడకపోవడం, శరీరంలో వాపు వంటి సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు. అదేవిధంగా మజ్జిగ జలుబు ప్రభావాన్ని కలిగి ఉంటుందట. ఇది ఛాతీలో కఫం పేరుకుపోయే సమస్యను పెంచుతుందట. జలుబు లేదా దగ్గుతో ఇబ్బంది పడుతున్నవారు మజ్జిగ తీసుకోవడం వల్ల లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుందట. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా మజ్జిగను ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదని చెబుతున్నారు. కాగా కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా మజ్జిగ తీసుకోవటం మంచిది కాదట. మజ్జిగలో ఉండే పొటాషియం, సోడియం పరిమాణం అధికంగా ఉంటుందట. మజ్జిగ తీసుకోవడం తీవ్రమైన మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి హానికరం అని చెబుతున్నారు. అలాంటి వారు వైద్యులను సంప్రదించిన తర్వాతే మజ్జిగ తీసుకోవాలట. కాగా కొందరిలో బలహీనమైన జీర్ణవ్యవస్థత ఉంటుందట. అలాంటి వారు కూడా మజ్జిగ ఎక్కువ తాగడం మంచిది కాదట. మజ్జిగ తాగిన తర్వాత అజీర్తి, కడుపు తిమ్మిరి లేదా అసౌకర్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.