Site icon HashtagU Telugu

Buttermilk Benefits: పెరుగు, మజ్జిగ.. రెండింటిలో ఏది మంచిదో తెలియాలంటే ఇది తెలుసుకోవాల్సిందే?

Curd Vs Buttermilk

Curd Vs Buttermilk

చాలామంది ప్రతిరోజూ పెరుగు, మజ్జిగ తింటూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది అంటే చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం పెరుగు మంచిది అయితే కొంతమంది మాత్రం మజ్జిగ మంచిది అని అంటూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఏది శరీరానికి మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..పెరుగు కంటే మజ్జిగతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల అది మన శరీరాన్ని వేడి నుంచి రక్షించి రిలీఫ్‌ ను అందిస్తుంది.

అలాగె ఎక్కువ మసాలాలు ఉండే ఫుడ్ తిన్న తర్వాత మజ్జిగ తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. అలాగే కడుపులో బాధ, నొప్పి వంటి సమస్యలను మజ్జిగ దూరం చేస్తుంది. ఇక పెరుగులో ప్రోటీన్స్ అధిక శాతంలో ఉంటాయి కాబట్టి శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నవారు పెరుగును తీసుకుంటే మంచిది. పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. అయినప్పటికీ వీటి మధ్య చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంది. అదేమిటంటే పెరుగు, మజ్జిగను వేర్వేరు పరిస్థితుల్లో తీసుకోవడం వల్ల వేర్వేరు ప్రయోజనాలను పొందవచ్చు.

పెరుగు తినడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి పెరుగు కూడా శరీరానికి చాలా ఉపయోగకరం. బరువు తగ్గాలి అనుకున్న వారు కూడా మజ్జిగను తీసుకోవడం ఎంతో మేలు. మజ్జిగలో క్యాల్షియంతో పాటు ఎన్నో విటమిన్లు లభిస్తాయి. అవి బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడతాయి.