Brown Eggs vs White Eggs: చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారంగా కోడిగుడ్లను దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తారు. అయితే మార్కెట్లో లభించే తెల్లటి గుడ్లు, గోధుమ రంగు గుడ్ల విషయంలో చాలామందిలో గందరగోళం ఉంటుంది. అసలు గోధుమ రంగు గుడ్డు ఏ రకం కోడి పెడుతుంది? ఏది ఆరోగ్యానికి మంచిది? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రంగు గుడ్డు ఏ కోడి పెడుతుంది?
సాధారణంగా ఎర్రటి లేదా గోధుమ రంగు ఈకలు కలిగిన కోళ్లు గోధుమ రంగు గుడ్లను పెడతాయి. అలాగే తెల్లటి ఈకలు ఉన్న కోళ్లు తెల్లటి గుడ్లను పెడతాయి. ఈ రెండు గుడ్ల పోషక విలువలు చాలా వరకు ఆ కోడికి పెట్టే ఆహారంపై ఆధారపడి ఉంటాయి. రుచి పరంగా పెద్ద తేడా లేకపోయినప్పటికీ గోధుమ రంగు గుడ్లలో ఉండే పచ్చసొన రంగు కొంచెం ముదురుగా ఉంటుంది.
తెల్లటి, గోధుమ రంగు గుడ్ల మధ్య వ్యత్యాసం
అనేక పరిశోధనల ప్రకారం.. గుడ్డు పెంకు రంగు అనేది కేవలం ఆ కోడి జాతిపైనే ఆధారపడి ఉంటుంది. దీనికి పోషకాలతో నేరుగా సంబంధం లేదు. అయినప్పటికీ మన దేశంలో లభించే నాటు కోడి గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే చాలామంది ఆరోగ్య కారణాల దృష్ట్యా గోధుమ రంగు గుడ్లనే ఇష్టపడతారు. ఒక పెద్ద గుడ్డులో సుమారు 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
Also Read: ఓటర్ల జాబితా తనిఖీ.. టీమిండియా బౌలర్ షమీకి నోటీసులు!
గోధుమ రంగు గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ప్రోటీన్ నిధి: ఇది శరీరానికి అవసరమైన నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.
కంటి ఆరోగ్యం: కంటి చూపు మెరుగుపడటానికి తోడ్పడుతుంది.
ఎముకల బలం: ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
జుట్టు సంరక్షణ: జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు మేలు చేస్తుంది.
బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
విటమిన్లు: ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
అసలైన గోధుమ రంగు గుడ్డును ఎలా గుర్తించాలి?
ప్రస్తుతం మార్కెట్లో రంగు వేసిన లేదా కల్తీ చేసిన గుడ్లు కూడా వస్తున్నాయి. వీటిని గుర్తించే పద్ధతులు.
పెంకు స్వభావం: ప్లాస్టిక్ లేదా నకిలీ గుడ్డు పెంకు చాలా నునుపుగా ఉంటుంది. అసలైన గుడ్డు పెంకు కొంచెం గరుకుగా ఉంటుంది.
నీటి పరీక్ష: ఒక పాత్రలో నీరు తీసుకుని గుడ్డును అందులో వేయండి. గుడ్డు నీటి అడుగు భాగంలో కూర్చుంటే అది అసలైనది, తాజాది అని అర్థం.
ఎవరు, ఎన్ని గుడ్లు తినాలి?
వైద్యుల సలహా ప్రకారం.. ఒక సాధారణ ఆరోగ్యవంతుడు రోజుకు ఒక గుడ్డు (పచ్చసొనతో సహా) తినవచ్చు. పిల్లల పెరుగుదల, అభివృద్ధి కోసం రోజుకు రెండు గుడ్లు ఇవ్వవచ్చు. మీకు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్లయితే గుడ్డు తినే ముందు ఖచ్చితంగా మీ డాక్టరును సంప్రదించండి.
