Site icon HashtagU Telugu

Heart Gel: హార్ట్ ఎటాక్ వస్తే రిపేర్ చేసే “జెల్”!

Heart Gel

Heart Gel

హార్ట్ ఎటాక్ వస్తే.. గుండెలోని కణజాలం దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న కణజాలాన్ని మళ్లీ మునుపటిలా పునరుజ్జీవింప చేసే ఔషధాలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. హార్ట్ ఎటాక్ వల్ల దెబ్బతినే గుండె కణజాలాన్ని మరమ్మతు చేసే ఒక జెల్ ను “మాంచెస్టర్ యూనివర్సిటీ” పరిశోధకులు తయారు చేశారు.దాన్ని ఎలుకలపై పరీక్షించారు.

ఈ జెల్ ను ఎలుకల్లోకి పంపించగా, రెండు వారాల పాటు క్రియాశీలంగా ఉంది. ఎలుకలకు నిర్వహించిన ఎకో కార్డియో గ్రామ్, ఎలెక్ట్రో కార్డియో గ్రామ్ పరీక్షల్లో ఈవిషయం వెల్లడైంది. హార్ట్ ఎటాక్ వచ్చిన ఎలుకలపైనా త్వరలో ఈ జెల్ ను పరీక్షించాలని యోచిస్తున్నారు. ఈ జెల్.. గుండెలో దెబ్బతిన్న కణజాలంలోకి వెళ్లి కొత్త కణజాలం ఏర్పడే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ జెల్ ను పెప్ టైడ్స్ అనే అమైనో యాసిడ్స్ తో తయారు చేశారు. ఇవి ప్రోటీన్ లోని బిల్డింగ్ బ్లాక్స్. వీటి వల్ల ఈ జెల్ వినియోగ యోగ్యంగా మారింది.

గుండెలోకి ఇంజెక్టు చేసిన తర్వాత ఎక్కువ ఒత్తిడి వాతావరణంలో ఉంటే.. పెప్ టైడ్స్ ద్రవరూపంలోకి మారిపోతాయి. గుండె కణజాలాన్ని రిపేర్ చేసే ఈ జెల్ బయో డీగ్రేడబుల్ రకానికి చెందినది.