బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) అనేది మహిళలకు మాత్రమే వస్తుందని అంత భావిస్తుంటారు. కానీ పురుషులకు కూడా (Men ) ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇది చాలా అరుదుగా ఇది పురుషుల్లో వస్తుంది. పురుషులలో బ్రెస్ట్ టిష్యూ చాలా తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా 50 ఏళ్ల వయసు తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు గడ్డలు కనిపించడం, బ్రెస్ట్ ప్రాంతంలో నొప్పి, చర్మం ఎర్రబడటం లేదా ముడతలు రావడం, నిపుల్ మార్పులు, రక్తస్రావం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వీటితోపాటు సడెన్ గా బరువు తగ్గడం జరుగుతుంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు జెనెటిక్ హిస్టరీ, అధిక బరువు, మద్యం ఎక్కువగా తీసుకోవడం, హార్మోనల్ అసమతుల్యత వంటి సమస్యలు. పూర్వ కుటుంబంలో క్యాన్సర్ ఉన్నవారికి మరింత ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం మంచిది.
క్యాన్సర్ నిర్ధారణ కోసం మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ వంటి టెస్టులు చేయడంతోపాటు, బయోప్సీ ద్వారా నిర్ధారణ చేస్తారు. చికిత్స పద్ధతుల్లో సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ ప్రధానంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుండేలా జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. పురుషులు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. సకాలంలో చికిత్స ప్రారంభిస్తే పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
Read Also : Ustad Zakir Hussain : సంగీతంలో విప్లవం తీసుకువచ్చిన ఓ జ్ఞాని జకీర్ : ప్రధాని మోడీ