Breast Cancer : తేనెటీగల విషంతో రొమ్ము క్యాన్సర్ కు చికిత్స…??

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందర్నీ వేధిస్తోంది

  • Written By:
  • Publish Date - February 25, 2022 / 02:38 PM IST

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందర్నీ వేధిస్తోంది. ఈ క్యాన్సర్ రక్కిసి బారినపడి ఎంతో ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. క్యాన్సర్ ను నివారించేందుకు ఎన్నో రకాలు ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.అయితే క్యాన్సర్ దశనను బట్టి…చికిత్సా పద్దతులను ఉపయోగిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ను మాన్పించడానికి తేనెటీగలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్త అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ కణాలను నాశనం చేసి…ఇతర కణాలకు హానీ కలిగించకుండా ఉంచే ఔషధశక్తి తేనెటీగల్లో ఉందని గుర్తించారు. తేనెటీగల విషం నుంచి తీసిన ద్రవంలో క్యాన్సర్ ను నయం చేసే శక్తి ఉందని ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు అధ్యయనంచేశారు. మూడువందలకు పైగా తేనెటీగల నుంచి విషాన్ని సేకరించి ఈ ప్రయోగం చేసినట్లు వెల్లడించారు.

అయితే ఈ విషంలో ట్రిపుల్ నెగెటివ్ హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు రొమ్ము క్యాన్సర్ ను బాగు చేసే గుణాలు కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు. తేనెటీగల్లో విషంతో కూడిన సమ్మేళనాన్ని రొమ్ము క్యాన్సర్ బాధితుల శరీరంలో ప్రవేశించిన తర్వాత గంటసేపటికి రియాక్షన్ ఉంటుంది. గంట తర్వాత క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే క్యాన్సర్ స్టేజీలను బట్టి ఈ చికిత్స ఉంటుందని చెబుతున్నారు. కీమోథెరఫీ విధానంతోపాటు దీన్ని ఫాలో అయినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయితే దీనికి సంబంధించిన పరీక్షలు ఇంకా ల్యాబ్ దశలోనే ఉన్నాయని వెల్లడించారు. ఈ విషంతో క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చని…ఈ టెస్టుల్లో తేలిందన్నారు. అయితే ఈ సమ్మేళనాన్ని క్రుతిమంగా కూడా స్రుష్టించవచ్చని చెబుతున్నారు. తేనెటీగల విషంతో క్యాన్సర్ చికిత్స పూర్తిస్థాయిలో జరగాలంటే ఇంకొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ కణాల సిగ్నలింగ్ పునరుత్పత్తి వంటి వాటిని ఈ విషం అడ్డుకుంటుందని దీంతోక్యాన్సర్ నుంచి ఉపశమనం కలుగుతుందని గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని…ఇంకా చికిత్స అందుబాటులకి రావాలంటే మరికొన్ని ఏళ్లు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు.