Breakfast Tips: మీరు కూడా మీ ఉదయపు అల్పాహారాన్ని విభిన్నంగా, రుచిగా, ఆరోగ్యకరంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఉదయపు అల్పాహారమే పునాది. మంచి బ్రేక్‌ఫాస్ట్ శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు కూడా ప్రతిరోజూ అదే ఉడకబెట్టిన గుడ్లు లేదా ఎండు బ్రెడ్ తిని బోర్ కొట్టినట్లయితే ఇప్పుడు కొత్తగా ఏదైనా ప్రయత్నించే సమయం వచ్చింది. ఇక్కడ మీ కోసం సులభంగా త్వరగా తయారయ్యే పోషకమైన అల్పాహార రెసిపీలను అందిస్తున్నాము. ఇవి రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
అల్పాహారం ఎందుకు ముఖ్యం?
సుమారు 6-8 గంటల నిద్ర తర్వాత శరీరానికి ఉదయాన్నే పోషకాహారం అవసరం. అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరానికి గ్లూకోజ్ అందుతుంది. దీనివల్ల మెదడు వేగంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా అల్పాహారం తినేవారిలో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. అయినప్పటికీ చాలా మంది సమయం లేకపోవడం వల్ల లేదా ఆఫీస్ హడావిడిలో అల్పాహారాన్ని మానేస్తుంటారు. ఈ అలవాటు మెల్లగా అలసట, చిరాకు, బలహీనతకు దారితీస్తుంది. అందుకే అల్పాహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
కీరా-పన్నీర్ శాండ్‌విచ్
కీరా-పన్నీర్ శాండ్‌విచ్ మీకు ఒక అద్భుతమైన ఎంపిక. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కావలసిన పదార్థాలు
- 8 బ్రెడ్ స్లైస్‌లు
- 1 కీరా (దోసకాయ)
- 200 గ్రాముల తురిమిన పన్నీర్
- 1 టేబుల్ స్పూన్ పచ్చి కొత్తిమీర చట్నీ
- 1 టేబుల్ స్పూన్ వెన్న
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- ముందుగా కీరాను తురిమి, దానిలోని నీటిని పూర్తిగా పిండేయండి.
- ఒక గిన్నెలో తురిమిన కీరా, పన్నీర్, చట్నీ, ఉప్పు వేసి బాగా కలపండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్‌పై సమానంగా పరచండి. పైన మరో బ్రెడ్ స్లైస్ పెట్టి దానిని క్రాస్ కట్ చేయండి.
- దీనిని టొమాటో సాస్‌తో కలిపి వడ్డించండి.
Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్.. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్.. తెలంగాణలో నేటి నుంచే
ఓట్స్ రవ్వ మసాలా ఇడ్లీ
- ఓట్స్ రవ్వ మసాలా ఇడ్లీ ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం.
- కావలసిన పదార్థాలు
- అర కప్పు ఓట్స్ పిండి, అర కప్పు రవ్వ, అర కప్పు పెరుగు.
- పోపు కోసం: ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి.
- కూరగాయలు: తరిగిన క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్.
- ఇతరత్రా: రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర
తయారీ విధానం
- ఒక గిన్నెలో ఓట్స్ పిండి, రవ్వ, పెరుగు వేయండి. అవసరమైనంత నీరు పోసి చిక్కటి పిండిలా కలిపి 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
- ఇప్పుడు బాణలిలో కొంచెం నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడాక ఇంగువ, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేయండి.
- తర్వాత తరిగిన కూరగాయలు (క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్) వేసి 2-3 నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించండి.
- ఈ తాలింపును ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో కలపండి. అందులోనే ఉప్పు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి.
- చివరగా ఈనో వేసి నెమ్మదిగా కలపండి.
- ఇడ్లీ పాత్రలకు కొంచెం నూనె రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి 8-10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించండి.
- వేడివేడి ఓట్స్ రవ్వ మసాలా ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా సాస్‌తో ఆస్వాదించండి.
