Breakfast : బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, దోస, వడ తింటున్నారా.. అయితే జాగ్రత్త.. ప్రమాదంలో పడ్డట్టే?

మామూలుగా మనము ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా ఎన్నో రకాల టిఫిన్లు చేస్తూ ఉంటాం. దోస, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, ఉగ్గాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 08:30 PM IST

మామూలుగా మనము ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా ఎన్నో రకాల టిఫిన్లు చేస్తూ ఉంటాం. దోస, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, ఉగ్గాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఐటమ్స్ ఉన్నాయి. కొందరు అన్నం ఎక్కువగా తీసుకుంటున్నాం అన్న భయంతో అన్నానికి బదులుగా రెండు పూటలా టిఫిన్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అలా తిన‌డం వ‌ల‌న జీర్ణ వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది . కోంద‌రు టీ, కాఫీ ల పైన ఎక్కువ‌గా ఆధార‌ప‌డి ఉంటారు. దాని వ‌ల‌న ఆక‌లి చ‌చ్చిపోయి అస‌లు ఆక‌లివేయ‌నివ్వ‌దు. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గే అవ‌కాశం ఉందది. అధిక బ‌రువు క‌ల‌వారు టీ , కాఫీ లు ఎక్కువగా తాగుతు ఉంటారు.

సాధార‌ణ బ‌రువు క‌ల‌వారు బాగా స‌న్న‌గా ఉన్న వారు టీ, కాఫీ లు ఎక్కువ‌గా తాగితే బ‌రువు త‌గ్గుతారు. అయితే ఉద‌యం బ్రెక్ ఫాస్ట్ గా ఇడ్లి , దోశ , వ‌డ వంటివి ప్ర‌తిరోజు క్ర‌మం త‌ప్ప‌కుండా తిన‌డం వ‌ల‌న జీర్ణ వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంది. అలాగే ఎసిడిటి సమస్య కూడా వ‌స్తుంది. మారుతున్న కాల‌నికి అనుగుణంగా కోంత‌మంది మాత్ర‌మే వీటిని తింటున్నారు. మిగ‌తా వాళ్ళంతా రోజు మూడు పూట‌ల అన్న‌మే తింటున్నారు. ఇప్ప‌డు ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్ , మ‌ధ్యాహ్నం అన్నం, మ‌ళ్ళి రాత్రికి అన్నంకు బ‌దులు టీఫిన్స్ వంటి అల్ఫాహ‌రం తింటున్నారు. ఇలా అన్ని టిఫిన్స్ ల‌తో పోలిస్తే ఇడ్లి కోద్దిగా బెటర్ అని చెప్పవచ్చు.

కానీ కొందరు ఇడ్లీలోకి సాంబార్, అల్లం చట్ని, కార‌ం పొడి,నెయ్యి వంటివి క‌లిపి తింటూ ఉంటారు. అలా తినడం వల్ల క‌డుపులో ఎసిడిటి పెరిగిపోతుంది. అలాగే బియ్యం కంటే మిన‌పప్పులో ఎక్కువ క్యాల‌రీలు ఉంటాయి. ఇవి షుగ‌ర్ ను పెంచుతాయి. ఇలా ప్ర‌తిరోజు తిన‌డం వ‌ల‌న పేగులు త‌మ జీర్ణ క్రియ శ‌క్తిని కోల్పోతుంది. దీని వ‌ల‌న జీర్ణ వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తింటుంది. కీళ్ళ నొప్పులు, వాత వ్యాధులు వ‌స్తాయి. మరి ఉదయం సమయంలో ఏం తినాలి అన్న విషయానికొస్తే.. ఉద‌యం స‌మ‌యంలో పెరుగ‌న్నం, రాత్రి మిగిల్చిన అన్నాన్ని మ‌ర‌స‌టి పోద్దున్నే పెరుగులో పెట్టుకొని తిన‌డం వ‌ల‌న మంచి ఆరోగ్యం క‌లుగుతుంది. పాత కాలంలో ఎక్కువ‌గా ఇలాగ తిన‌డం వ‌ల‌నే చాలా ఆరోగ్యంగా ఉండేవారు.