Site icon HashtagU Telugu

LED Exposures: నుంచి ఆ ప్రమాదం గ్యారెంటీ అంటున్న శాస్త్రవేత్తలు.. అది ఏంటంటే?

Blue Light Expouser

Blue Light Expouser

ప్రస్తుతం మనం నివసిస్తున్న సమాజం మొత్తం డిస్ప్లే లతోనే సగం నిండి ఉంది. అవునండి ఇంట్లో, ఆఫీసులో వాడే ఎల్ఈడి లైట్లు, టీవీలు, కంప్యూటర్లు, లాప్ టాప్ లు, సెల్ ఫోన్లు. ఇలా వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో వీటిని నుండి వచ్చే జబ్బులు ఎక్కువే.. ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ల Display వల్ల చాలా ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

Display నుంచి వచ్చే నీలిరంగు కాంతి మనపై చాలా ప్రభావం చూపిస్తుంది అని తెలిపారు. అవి మన శరీరంలో ఇతర జీవ గడియారాన్ని, జీవక్రియలను ప్రభావితం చేస్తాయని గుర్తించారు. ఈ ప‌రిశోధ‌నలో మనుషుల జీవ క్రియలతో పోలివున్న ‘డ్రోసోఫిలా మెలనోగాస్టర్’ అనే రకం ఈగలను ఎంచుకొని ప్రయోగించారు.

ఆ ప్రయోగంలో ఈగలలో వచ్చిన మార్పులను గమనించారు. ఈగలపై నీలి రంగు ఎల్ఈడీ కాంతిలోకి తీసుకెళ్లి పరీక్షించారు. అలా పరీక్షించిన ఈగల శరీరంలో కొన్ని రకాల కణాలు కాంతికి ప్రతిస్పందిస్తూ ఉంటాయని.. కానీ నీలిరంగు కాంతి కారణంగా ప్రతిస్పందించదని, అంతర్గత అవయవాల కణాలపై ఆ కాంతి ప్రభావం పడుతుందని తెలిపారు. ఇక శరీర కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాలపై ఈ కాంతి ప్రభావితం చేస్తుంది అని.. అంతేకాకుండా కణాల పనితీరుపై ప్రభావం పడుతుందని తెలిపారు.

సాధారణ వయసు పైబడిన కొద్దీ, ముఖ్యంగా వృద్ధాప్యం దరి చేరినకొద్దీ మైటోకాండ్రియాలలో కొన్ని రకాల రియాక్షన్లు నిలిచిపోతాయని.. ఆ తరహాలో నీలిరంగు కాంతి కూడా ప్రభావం చూపిస్తుంది అని.. దీంతో వయసు మీద పడిన లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కాబట్టి ఇటువంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉండాలి అంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి.