Blood Vessels: డయాబెటిక్ న్యూరోపతి తీవ్రమైతే రక్తనాళాలు బ్లాస్ట్ అయ్యే ముప్పు

మొత్తం డయాబెటిక్ పేషెంట్లలో 50 శాతం మంది డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్నారని ఒక అంచనా. 

  • Written By:
  • Publish Date - February 3, 2023 / 07:00 PM IST

డయాబెటిస్ రోగులలో నరాలు దెబ్బతినే సమస్యను “డయాబెటిక్ న్యూరోపతి” అంటారు. ఇందులో డయాబెటిక్ రోగి శరీరంలోని ఏదైనా భాగంలో నరాలు దెబ్బతింటాయి. మొత్తం డయాబెటిక్ పేషెంట్లలో 50 శాతం మంది డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతున్నారని ఒక అంచనా. దీన్ని సులభంగా నివారించవచ్చు. అయితే నరాలు దెబ్బతినడానికి ముందు కొన్ని సంకేతాలు శరీరంలో కనిపిస్తాయి. వాటిని రోగి గుర్తించి అలర్ట్ అయి, వైద్యుడిని సంప్రదించాలి.

◆ లక్షణాలు..

అమెరికాలోని ప్రఖ్యాత
మాయో క్లినిక్ ప్రకారం .. డయాబెటిక్ న్యూరోపతిలో 4 రకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ దాదాపు ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి.

● తిమ్మిరి : మొదట చేతులు, కాళ్ళ నరాలలో డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలు కనిపిస్తాయి. దీని కారణంగా చేతులు , కాళ్ళు మొద్దుబారడం ప్రారంభిస్తాయి.  మొదట చేతిలో తిమ్మిరి వస్తుంది.

● రక్తనాళాల గోడ బలహీనపడటం : షుగర్ రోగుల్లో
హై బ్లడ్ షుగర్ కారణంగా రక్త నాళాల(బ్లడ్ వెస్సెల్స్) గోడ బలహీన పడుతుంది. అందుకే రక్త నాళాల్లో లీకేజీ ఏర్పడే ముప్పు ఏర్పడుతుంది. సిరలు పగిలిపోయే గండం ముసురుకుంటుంది.దీని కారణంగా ఆక్సిజన్ , ఇతర పోషకాలు శరీరంలోని అవయవాలకు చేరుకోవడం కష్టమవుతుంది.

● చేతులు, కాళ్ళలో తిమ్మిరి, నొప్పి కలుగుతాయి.

● ఒళ్ళు జలదరింపు లేదా బర్నింగ్ అయినట్టు ఫీలింగ్ ఎదురవుతుంది.

● కండరాల బలహీనత వస్తుంది.

● కొంతమందిలో స్పర్శకు విపరీతమైన సున్నితత్వం ఏర్పడుతుంది.బెడ్ షీట్ ను తాకడం కూడా బాధాకరంగా మారుతుంది.

● అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, దిమ్మలు, పొక్కులు, ఎముకలు, కీళ్ల పగుళ్లు వంటి తీవ్రమైన పాదాల సమస్యలు కలుగుతాయి.కొందరిలో పక్షవాతం కూడా రావచ్చు.

◆వైద్యుని వద్దకు ఎప్పుడు వెళ్లాలి?

పాదంలో ఇన్ఫెక్షన్ లేదా దిమ్మలు , బొబ్బలు మందులు వేసినా నయం కాకపోతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీనితో పాటుగా మూర్ఛపోవడం, తల తిరగడం, మంట, బలహీనత, చేతులు, కాళ్లలో తిమ్మిరి కలిగితే డయాబెటిక్ న్యూరోపతి ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

◆ డయాబెటిక్ క్యాపిటల్ గా ఇండియా

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో 422 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. దీనితో పాటు మధుమేహం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏటా దాదాపు 15 లక్షల మంది మరణిస్తున్నారు.  అయితే ప్రపంచంలోని మొత్తం మధుమేహ రోగులలో 17 శాతం మంది భారత్‌కు చెందినవారే కావడం మరింత ఆందోళనకరం. అంటే భారతదేశంలో 8 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నారు.  గణాంకాల ప్రకారం 2045 నాటికి భారతదేశంలో 13.5 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు అవుతారు. అందుకే భారతదేశాన్ని ప్రపంచపు డయాబెటిక్ క్యాపిటల్ అని పిలుస్తారు. మధుమేహం చాలా ప్రమాదకరమైనది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరంలోని నరాలు కూడా పగిలిపోతాయి.

◆ దీన్ని ఎలా నియంత్రించాలి?

డయాబెటిక్ న్యూరోపతి వస్తే.. నరాలు దెబ్బతినకుండా ఉండేందుకు శరీరంలో షుగర్ లెవల్ ను కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం.  రోజూ డయాబెటిస్ మెడిసిన్ తీసుకుంటూ ఉండండి . వ్యాయామం చేయండి. ఆకు కూరలను ఆహారంలో తీసుకోవాలి. వేయించిన కాల్చిన, తీపి వంటి చక్కెరను పెంచే వాటిని కూడా ముట్టుకోవద్దు. ప్రతిరోజూ చేతులు , కాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి.