Site icon HashtagU Telugu

Health Tips: రక్తపోటు, మధుమేహం, ఒక్కదెబ్బతో పారిపోతాయి.. ట్రైయ్ కరో!

Whatsapp Image 2023 03 23 At 19.08.17

Whatsapp Image 2023 03 23 At 19.08.17

Health Tips: మారుతున్న కాలనుణంగా తీసుకునే ఆహారంలో పోకడలు పెరిగిపోయాయి. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక వ్యాధులు ప్రభలుతున్నాయి.ఆరోగ్యకరమైన మార్పులు లేకపోవడం అనేది వ్యాధులకు కారణం అవుతుంది. ప్రస్తుతం డయాబెటిస్, రక్తపోటు అన్నవి మేజర్ సమస్యలు ఉంటున్నాయి. ఈ రెండింటికీ సరిగా చికిత్స చేయలేకపోతే స్ట్రోక్, బలహీనమైన కంటి చూపు, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలకు దారి తీస్తోంది.

రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రెండు ఆరోగ్య సమస్యలను నయంచేయడంలోనూ నియంత్రణలో ఉంచడంలోనూ ఔషదాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.వాటితో పాటు మనం మామూలుగా ఉపయోగించే కొన్ని మూలికలు కూడా ఈ మధుమేహం,రక్తపోటు రెండింటినీ అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి.

తులసి మన రోజువారి జీవితంలో భాగమైన పవిత్రమైన మొక్క. దీనితో ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా గుణాలను పొందవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంచడంలోనూ తులసి ప్రధానంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. దాని లక్షణాల కారణంగా దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.మెంతికూర మధుమేహ వ్యాధికి ఉపయోగపడుతుందని అనేక పరిశోధనలు తెలిపాయి. పది గ్రాములు నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.