Site icon HashtagU Telugu

Blood Donation: రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 30 Jan 2024 03 55 Pm 9233

Mixcollage 30 Jan 2024 03 55 Pm 9233

అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది అని అంటూ ఉంటారు. రక్తదానం ఒకరి ప్రాణాలను కాపాడుతుంది. అత్యవసర పరిస్థితులలో ఒకరికి రక్తం ఇవ్వడం వల్ల ఒక నిండు ప్రాణాలను నిలబెట్టినట్టు అవుతుంది. రక్తం సమయానికి అందక ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అందుకే ఈ రక్త దానం చాలా మంచిదని రక్త దానం చేయడం అన్ని దానాల కంటే మిన్న అని అంటూ ఉంటారు. అందుకే రక్తదానం చేసే వాళ్ళను ప్రోత్సహించడం రక్తదానం చేయమంటూ అవగాహన కల్పించడం లాంటివి చేస్తూ ఉంటారు. మీకు తెలుసా రక్తదానం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలామంది రక్తదానం అంటే భయపడుతూ ఉంటారు.

కానీ రక్తం దానం చేయడం వల్ల లాభమే కానీ నష్టం ఏమాత్రం ఉండదు. నిజానికి రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్యం కలగదు. రక్తదానం చేయడం వల్ల రక్తం కావాల్సిన వారిని కాపాడటంతో పాటు తమకు తాము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందిన వారు అవుతారు. తరచుగా రక్తదానం చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఫిట్ గా తయారవుతారు. ఒకసారి రక్తాన్ని దానం చేస్తే 650 కేలరీలు ఖర్చవుతాయి. రక్తాన్ని దానం చేయడం వల్ల శరీరంలో వచ్చే హెమోక్రామటోసిస్ అనే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ సమస్యను కేవలం రక్తాన్ని దానం చేయడం వల్లనే తగ్గించుకోవచ్చు. నిజానికి రెగ్యులర్ గా రక్తం దానం చేయడం వల్ల శరీరంలో ఐరన్ శాతం తగ్గుతూ వస్తుంది.

శరీరంలో ఐరన్ ఎక్కువ అయితే హెమోక్రామటోసిస్ అనే సమస్య వస్తుంది. రక్తం దానం చేయడం వల్ల శరీరంలో ఐరన్ శాతం తగ్గడంతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రతీ మూడు నెలలకు ఓసారి రక్తాన్ని దానం చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. రక్తదానం వల్ల ఐరన్ లేవల్స్ తగ్గడంతో గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఐరన్ ఎక్కువ అయితే ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే క్యాన్సర్ ముప్పు కూడా తప్పుతుంది. క్యాన్సర్ రిస్కే ఉండదు. దీనికి కూడా కారణం ఐరనే. ఐరన్ తక్కువ అవుతున్నా కొద్దీ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. శరీరంలో కొత్తగా రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. పాత రక్తకణాలు చనిపోయి కొత్తవి ఉత్పత్తి అవ్వడంతో రక్తం ఉత్తేజితం అవుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకటి సరి కాకపోయినా.. కనీసం ఆరు నెలలకు ఓసారి రక్తాన్ని దానం చేసినా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.