Site icon HashtagU Telugu

Blood Donation: ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న హిందూ బాలుడికి రక్తదానం చేసిన ముస్లిం యువకుడు!

Dc Cover Qvcf9tikeuugvafjs5ebqcis00 20210614205930.medi

Dc Cover Qvcf9tikeuugvafjs5ebqcis00 20210614205930.medi

Blood Donation: ఇప్పుడిప్పుడే ప్రజలలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కులం, మతం అనే భేదాలను దూరం పెట్టేసి అందరూ కలిసిపోతున్నారు. సహాయం చేయటానికి ముందుకు కూడా వస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ ముస్లిం యువకుడు కూడా ఎటువంటి మతభేదం చూపించకుండా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న హిందూ బాలుడిని కాపాడాడు. ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్ లో ఛతర్ పూర్ లో 36 ఏళ్ల రాఫత్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి శనివారం తన ఇంటి నుంచి నమాజ్ కు బయలుదేరాడు. ఆ సమయంలో ఆయనకు 60 రోజుల హిందూ బాలుడు అనేమియా సమస్యతో బాధపడుతున్నాడని.. వెంటనే రక్తం అవసరమని ఫోన్ రావడంతో రాఫత్ ఖాన్ వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాడు.

ఎటువంటి మతభేదం ఆలోచించకుండా వెంటనే రక్తం దానం చేసి ఆ బాలుడిని కాపాడాడు. ఇక ఈ విషయాన్ని తాజాగా ఓ న్యూస్ ఏజెన్సీకి తెలిపాడు. మనోరియా గ్రామానికి చెందిన ఆ బాబు తండ్రి రక్తం బయట ఓ దళారిని నమ్మి మోసపోయాడంటూ.. తనకు ఫోన్ చేసి చెప్పడాని.. ఇక ఆ దళారి ఆయన దగ్గర రూ.750 తీసుకొని తర్వాత మోసం చేసి జారుకున్నాడని తెలిపారని తర్వాత తను వెళ్లి దానం చేశాను అని అన్నాడు.

ఆ తర్వాత ఆ బాబు తండ్రి తన బాబు ఆరోగ్యం మెరుగైంది అని ఖాన్ కు చెప్పినట్టు తెలిసింది. ఆపద కాలంలో దేవుడిలా వచ్చి తన కొడుకును కాపాడాడని తెలిపాడు. ఇక ఆ బాబు పరిస్థితి ఇప్పుడు కుదుటపడింది అని డాక్టర్లు కూడా తెలిపారు. ఇక రాఫత్ ఇప్పటికే 13 సార్లు రక్తదానం చేసినట్లు తెలిసింది.