Site icon HashtagU Telugu

Glaucoma : లక్షణాలు బయటపడవు.. కానీ కళ్లుపోతాయ్.. ‘గ్లకోమా’ డేంజర్ బెల్స్!

Glaucoma

Glaucoma

Glaucoma : ఎలాంటి కంటి సమస్యలు కనిపించవు.. కానీ ఒక వ్యాధి వల్ల కొందరు అంధులైపోతున్నారు. దీనికి కారణం.. గ్లకోమా. గ్లకోమా వ్యాధి వల్ల కంటిలో ఉండే ఒక నరం బలహీన పడి దెబ్బతింటుంది. కంటికి వెనుకాల ఒక నేత్రనాడి ఉంటుంది. ఇది కళ్లను మెదడుకు అనుసంధానిస్తుంది. కంటికి ముందు భాగంలో అసాధారణ ద్రవాలు పేరుకుపోవడం వల్ల, కంటిపై ఒత్తిడి పెరిగి ఈ నరం దెబ్బతింటుంది.  70 నుంచి 80 ఏళ్ల వారు గ్లకోమా వల్ల ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని అంటారు.

We’re now on WhatsApp. Click to Join

లక్షణాలు ఇవీ..

గ్లకోమా(Glaucoma) లక్షణాల విషయానికొస్తే..  ఈ లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. చూపు మసక మసకగా కనిపించడం, ప్రకాశవంతమైన వెలుతురు చుట్టూ ఇంద్రధనస్సు లాంటి వలయాలు కనిపించడం మొదలవుతుంది.  గ్లకోమా వల్ల రెండు కళ్లు దెబ్బతింటాయి. ఒక కన్ను బాగా ప్రభావితం కావొచ్చు. కళ్లలో తీవ్ర నొప్పి, వికారం, వాంతి వచ్చేలా ఉండటం, కళ్లు ఎర్రగా మారిపోవడం,తలనొప్పి, కళ్ల చుట్టూ మెత్తబడటం, వెలుతురు చుట్టూ సర్కిల్స్ కనబడటం, మసక మసకగా కనిపించడం వంటి లక్షణాలు కూడా ఉండొచ్చు.

Also Read :Credit Cards Vs Doubts : క్రెడిట్‌ కార్డు‌లపై సవాలక్ష డౌట్స్.. ఆర్‌బీఐ సమాధానాలివీ

మధుమేహం ఉన్నవారికి..

ఒకవేళ మీ తల్లిదండ్రుల్లో లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా గ్లకోమా ఉంటే, అది మీకు వచ్చే అవకాశం ఎక్కువ.  కంటి చూపు లోపాలున్న వారికి లేదా మధుమేహం ఉన్నవారికి గ్లకోమా వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్లకోమాను నిరోధించే అవకాశం ఉందా అంటే ఇంకా స్పష్టత లేదు. గ్లకోమా వల్ల ఎవరికైనా చూపు పోతే, వారి చూపును తిరిగి తీసుకురాలేరు. గ్లకోమాకు వాడే చికిత్సల విషయానికొస్తే.. చుక్కల మందు  కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. లేజర్ ట్రీట్‌మెంట్ చేయడం ద్వారా కళ్లలో ద్రవాల ప్రవాహంలో ఉన్న అంతరాయాలను తొలగించవచ్చు. కంటిలో తక్కువ ద్రవాల ఉత్పత్తి నియంత్రణకు లేజర్ ట్రీట్‌మెంట్‌ను వాడతారు. కంటిలోని ద్రవాల పారుదలను పెంచేందుకు సర్జరీ కూడా చేస్తుంటారు.

Also Read : Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం వీడియోలు, విశేషాలు ఇవిగో

గ్లకోమా రకాలు