Black Turmeric: రోగాలను తరిమికొట్టే నల్ల పసుపు.. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

మనం తరచుగా పూజలో, వంటల్లో ఉపయోగించే పసుపు.. పసుపు రంగులో ఉంటుంది. అయితే ఈ పసుపు ఆరోగ్యానికి

  • Written By:
  • Publish Date - August 21, 2022 / 06:30 AM IST

మనం తరచుగా పూజలో, వంటల్లో ఉపయోగించే పసుపు.. పసుపు రంగులో ఉంటుంది. అయితే ఈ పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పసుపును వాడటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మాత్రమే కాకుండా వ్యాధుల నుంచి కూడా మనం బయటపడవచ్చు. అయితే పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎన్నో రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. అయితే పసుపు కేవలం పసుపు రంగులో మాత్రమే కాకుండా నల్ల రంగులో కూడా దొరుకుతుందట. నల్ల రంగు పసుపు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మరి నల్ల రంగు పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మైగ్రేన్‌ సమస్యతో బాధపడుతున్నవారు పెద్ద పెద్ద ధ్వనులను వినలేదు. అటువంటివారు మైగ్రేన్ సమస్య నుంచి బయట పడటం కోసం ఈ నల్ల పసుపును ముద్దలా నూరి నుదుటి భాగంలో అద్దాలి. అలాగే నల్ల పసుపు వాడటం వల్ల దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మహిళలు బహిష్టు సమయంలో ఎదుర్కొనే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా నల్ల పసుపు పొడిని వేడి పాలల్లో కలుపుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి చేగుతుంది. సాధారణ పసుపు మాదిరిగానే ఈ నల్ల పసుపు కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ నల్ల పసుపులో తేనెను కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారడంతో పాటు ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు మొటిమలు కూడా తొలగిపోతాయి.

అలాగే శరీరంలో వేడి చేసినప్పుడు, జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, శ్వాస సమస్యలు, వాంతులు, పొట్టలో గడబిడలు, దగ్గు వంటివి ఉన్నప్పడు ఈ నలుపు పసుపు కొమ్ములను వాడటం వలన ఉపశమనం పొందవచ్చు.
మూత్ర సంబంధ వ్యాధుల బారి నుంచి బయటపడేందుకు కూడా నల్ల పసుపు బాగా పనిచేస్తుంది. దగ్గు, ఆస్తమా నుంచి ఉపశమనం పొందేందుకు రాత్రి పడుకునే ముందు నల్ల పసుపు దుంపను తినాలట. ఈ నల్ల పసుపు కొమ్మును నీళ్లతో కలిపి పేస్టులా చేసి గాయాలపై రుద్దితే గాయాలు వీలైనంత త్వరగా మానిపోతాయి. నల్ల పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ-ఆస్తమా, యాంటీ ఆక్సిడెంట్, అనాల్జేసిక్, లోకోమోటర్ డిప్రెసెంట్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉంటాయి.

ఇవి కండరాల విశ్రాంతి, ఆందోళన, సీఎన్ఎస్ డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నల్ల పసుపు పొట్ట సంబంధ సమస్యలను నయం చేయడంలో ఉపకారిగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పి లేదా గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ నల్ల పసుపు వాడితే మంచి ఫలితం పొందవచ్చు. నల్ల పసుపు పొడిని నీళ్లలో కలిపి నిత్యం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.