Black Tomatoes: నల్ల టమాటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

మామూలుగా ప్రతి ఒక్కరి కిచెన్ లో టమాటాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే టమోటాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎం

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 09:20 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరి కిచెన్ లో టమాటాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే టమోటాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి అన్న విషయం అందరికీ. మనం ఇప్పటివరకు ఎర్రగా ఉండే టమోటాలు మాత్రమే చూసి ఉంటాం. ఆ టమాటాలు కూడా గుండ్రంగా కోడుగుడ్డు ఆకారంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే టమాటోలలో నల్ల రకం టమోటోలు కూడా ఉన్నాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ నల్ల టమాటాలు చూడడానికి నల్లగా కనిపిస్తూ నిగనిగలాడుతూ ఉంటాయి. అయితే ఎర్ర టమాటోలతో పోలిస్తే ఈ నల్ల టమాటాలే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

మరి నల్ల టమాటాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నల్ల టమాటాలను ఇండిగో రోజ్ అని పిలుస్తారు. వీటిని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వీటి ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది. అందుకే ఇవి అధికంగా అమ్మకానికి రావడం లేదు. ఎర్ర టమాటో లతో పోలిస్తే ఈ నల్ల టమోటోలు త్వరగా చెడిపోవు. ఇందులో విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిని మీరు సూపర్ ఫుడ్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే క్యాన్సర్‌ని అడ్డుకునే శక్తి ఈ నల్ల టమాటోలకి ఉంది. అందుకే క్యాన్సర్ రోగులు అక్కడ ఖచ్చితంగా నల్ల టమోటోలను తింటూ ఉంటారు.

క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలనుకునేవారు కూడా నల్ల టమోటోలను తినడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే అక్కడ వీటి అమ్మకాలు అధికంగా ఉంటాయి. వీటిని మన దేశంలో తక్కువ వినియోగిస్తారు. వీటిని కూరలో వేస్తే కూరంతా నల్లగా మారిపోతుంది. అయితే మన దేశంలోని వారు నలుపు రంగు నచ్చక ఎరుపు టమోటాలనే తింటూ ఉంటారు. ఈ టమోటోలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ కూడా లభిస్తుంది. దీనిలో లైకోపీన్, బీటా కెరటిన్, విటమిన్ సి, ఫ్లావనోయిడ్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో ఎక్కువే. ఈ నల్ల టమోటాల పుట్టిల్లు ఉక్రెయిన్లోని క్రిమియన్ ద్వీపకల్పం అని చెబుతారు. అక్కడ నుంచే ఇవి వేరే ప్రాంతాలకు చేరాయని అంటారు. వీటి రుచి ఎర్ర టమాటలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇవి తీపి రుచిని కలిగి ఉంటాయి. పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. వీటిని తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఈ నల్ల టమోటాలు తింటే ఎంతో మంచిది.