Site icon HashtagU Telugu

Banana: నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Banana

Banana

మార్కెట్ లో మనకు ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు ముందు వరుసలో ఉంటుంది. ఈ అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా విరివిగా లభించడంతో పాటుగా సరసమైన ధరలు లభిస్తూ ఉంటాయి. ఈ అరటిపండ్లు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. మార్కెట్లో మనకు రకరకాల అరటి పండ్లు లభిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం మంది ఇష్టపడే అరటిపండ్లు ఎల్లో కలర్ అరటి పండ్లు. వీటిని తెగ ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిలో కొన్ని అరటి పండ్లకు నల్లటి మచ్చలు వచ్చి ఉంటాయి.

వీటినే చుక్క అరటి పండ్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని తెగ ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చుక్క అరటిపండ్లు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలామంది నల్లమచ్చలుంటే పాడైపోయాయని అనుకుంటారు. కానీ నల్లమచ్చలొచ్చిన అరటిపండ్లను తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నల్లటి మచ్చలు వచ్చిన అరటి పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి పండు తొక్కపై ఉండే నల్లమచ్చల్లోని టీఎన్ఎఫ్ క్యాన్సర్ తో పోరాడే పదార్థం. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని అడ్డుకుంటుంది.

అందుకే ఈ పండును ఎంచక్కా తినవచ్చు. బాగా పండిన అరటి పండ్లు తీయగా, టేస్టీగా ఉంటాయి. అరటిపండ్లు బాగా పండినప్పుడు వాటిలోని పిండి పదార్థాలు చక్కెరలుగా మార్చబడతాయి. ఈ పండ్లు చాలా ఈజీగా జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. అరటి పండు తొక్కపై ఉండే నల్ల మచ్చల్లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో అనవసరపు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బాగా పండిన అరటిపండు యాంటాసిడ్ గా పనిచేస్తుంది. అలాగే కడుపు ఆమ్లాలు, చికాకు నుంచి కూడా ఇలాంటి పండ్లు రక్షిస్తాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గుండెల్లో మంట త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. అలాగే బాగా పండిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మీరు అంటువ్యాధులు, సీజనల్, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే రోగాలకు దూరంగా ఉంటారు. అయితే బాగా పండిన అరటి పండ్లను డయాబెటీస్ పేషెంట్లు అస్సలు తినకూడదట. ఎందుకంటే వీటిలోని పిండి పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుందని, అలాగే బాగా పండిన అరటిపండ్ల నుంచి చెడిపోయిన వాసన వచ్చినా కూడా అస్సలు తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే..