మామూలుగా మనకు మార్కెట్లో ఏడాది పొడవునా అరటి పండ్లు లభిస్తూ ఉంటాయి. కొన్ని పసుపు పచ్చగా ఉంటే మరికొన్ని ఎరుపుగా కూడా ఉంటాయి. ఇలా రకరకాల అరటి పండ్లు లభిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు చుక్క అరటి పండ్లు అనేవి కూడా లభిస్తూ ఉంటాయి. చాలావరకు ఈ చుక్క అరటి పండ్లను తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇవి చాలా తీపి గా ఉంటాయని ఇంకా మంచి ప్రయోజనాలను కలిగి ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంతకీ నల్లటి మచ్చలు ఉన్న అరటిపండును తినవచ్చా, తినకూడదా తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలామంది అరటిపండు తొక్కపై నల్లటి మచ్చలు కుళ్లిపోవడానికి సంకేతం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి పాడైపోయినవని కాదట. లాంటి అరటి పండు బాగా పండిందని అర్థం అంటున్నారు. అరటి పండు తొక్కపై ఉండే నల్లమచ్చల్లోని టీఎన్ఎఫ్ క్యాన్సర్ తో పోరాడుతుందట. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలతో పోరాడుతుందట. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా అడ్డుకుంటుందని చెబుతున్నారు. బాగా పండిన అరటి పండ్లు తీయగా, టేస్టీగా ఉంటాయట.. అరటిపండ్లు బాగా పండినప్పుడు వాటిలోని పిండి పదార్థాలు చక్కెరలుగా మార్చబడతాయట ఈ పండ్లు చాలా ఈజీగా జీర్ణమవుతాయని, జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
అదేవిధంగా అరటి పండు తొక్కపై ఉండే నల్ల మచ్చల్లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో అనవసరపు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాగా పండిన అరటిపండు యాంటాసిడ్ గా పనిచేస్తుందట. అలాగే కడుపు ఆమ్లాలు, చికాకు నుంచి కూడా ఇలాంటి పండ్లు రక్షిస్తాయట. ఇలాంటి పండ్లను తినడం వల్ల గుండెల్లో మంట త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. కాగా బాగా పండిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయట. దీంతో మీరు అంటు వ్యాధులు, సీజనల్, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారట. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే రోగాలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. బాగా పండిన అరటి పండ్లను డయాబెటిస్ పేషెంట్లు తినకూడదట.