Site icon HashtagU Telugu

Plum Jamun: ఈ పండ్లు తింటే చాలు మూడు రోజుల్లో షుగర్ దిగి రావాల్సిందే?

Mixcollage 30 Jun 2024 07 10 Pm 3965

Mixcollage 30 Jun 2024 07 10 Pm 3965

షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా కాస్త సంకోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇష్టమైన పండ్లు తినడానికి కూడా కాస్త వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ మనం తినే పండ్లలో కొన్ని రకాల పండ్లు షుగర్ ను తగ్గించడంతో పాటు మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుస్తాయి. అటువంటి వాటిలో నేరేడు పండ్లు కూడా ఒకటి. కేవలం వేసవికాలంలో మాత్రమే లభించే ఈ పండ్లు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నేరేడు పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తింటూ ఉంటారు.

ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. అయితే ఈ నేరేడు పండ్లు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ నేరేడు పండ్లలో పీచు, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి6, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు లాభిస్తాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు నేరేడును ప్రతిరోజు తింటుండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. ఫ్రూట్ సలాడ్ తినాలనుకునే వారు నేరేడు పండ్లతో తయారు చేసిన సలాడ్ తినడంవల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలోకి వస్తాయి. అలాగే నేరేడు పండ్లు ఫిజ్ తయారు చేయడానికి ముందుగా నిమ్మకాయ సోడాను గ్లాసులోకి పోసుకోవాలి. అందులో నేరేడు పండ్ల గుజ్జును వేసి బాగా మిక్స్‌ చేసి పక్కన పెట్టాలి. ఇలా తయారు చేసిన ఫిజ్‌ను తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి. అలాగే మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. నేరేడు పండ్ల హల్వా తయారు చేయడానికి ముందుగా ఆ పండ్ల నుంచి గుజ్జును తీయాలి. దాన్ని ఒక బౌల్‌లో వేసి అందులో తేనె, చియా గింజలను మిక్స్ చేసి హల్వాను సిద్ధం చేసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇలా నేరేడు పండ్లు నేరుగా తీసుకోవడంతో పాటు వివిధ రకాలుగా కూడా తీసుకోవచ్చు. ఈ నేరేడు పండ్లు కేవలం వేసవి కాలంలో మాత్రమే లభిస్తాయి కాబట్టి అవి దొరికినప్పుడే తీసుకోవడం చాలా మంచిది.

Exit mobile version