Health Tips: చలికాలంలో అలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే వాటిని తీసుకోవాల్సిందే?

మామూలుగా చలికాలం వచ్చింది అంటే చాలు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దానికి తోడు చలికాలంలో వచ్చేసి సీజనల్ వ్యాధులు మరింత ఇబ్బంది పెడుత

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 09:43 PM IST

మామూలుగా చలికాలం వచ్చింది అంటే చాలు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దానికి తోడు చలికాలంలో వచ్చేసి సీజనల్ వ్యాధులు మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో నల్ల మిరియాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చు. నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటీరీ గుణాలతో పాటు విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. మరి శీతాకాలంలో నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటివి ఎటాక్ చేస్తూనే ఉంటాయి. ఇలాంటి రాకుండా ఉండాలంటే నల్ల మిరియాలు హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. శీతా కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీలో కూడా ఉష్ణోగ్రత పడి పోతుంది. ఈ సమయంలోనే ఇమ్యూనిటీ లెవల్స్ కూడా తగ్గి పోయి.. నీరసంగా, అలసటగా ఉంటుంది. దీంతో పలు రకాల సమస్యలు ఎటాక్ అవుతాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పడి పోకుండా చూస్తుంది.

అలాగే నల్ల మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటీరీ గుణాల కారణంగా శ్వాస కోశ రాకుండా ఉంటాయి. చలి కారణంగా దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మిరియాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే.. శ్వాస కోశ సమస్యలు, ఉబ్బసం కూడా తగ్గుతుంది. కాబట్టి చలికాలంలో నల్ల మిరియాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.