Site icon HashtagU Telugu

Black Pepper : ఆరోగ్యానికి అద్భుత వరం మిరియాలు

Black Pepper Health Benefits

Black Pepper Health Benefits

ప్రతి ఇంట్లో లభించే మసాలా దినుసుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కీలకమైంది నల్ల మిరియాలు. నల్ల మిరియాల్లో (Black Pepper) పోషక పదార్ధాలు చాలా ఉంటాయి. ఆరోగ్యానికి ఓ ఔషధంలా పనిచేస్తాయి. నల్ల మిరియాలు ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభిస్తాయి. ఇవి వంట రుచిని పెంచడమే కాకుండా..ఆరోగ్యానికి మెరుగుపరుస్తాయి. నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు దూరమౌతాయి.

నల్ల మిరియాల్లో చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. నల్ల మిరియాల్లో సోడియం, పొటాషియం వంటి మినరల్స్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా..వ్యాధుల్ని దూరం చేస్తాయి. నల్ల మిరియాలతో కాడా చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ తాగే టీలో కూడా 4-5 మిరియాలు వేసుకుని తాగవచ్చు. ఇలా కాకుండా నల్లి మిరియాలు పౌడర్ చేసుకుని..తేనె, కిస్మిస్ వంటి పదార్ధాలతో కలిపి తీసుకోవచ్చు.

ఇమ్యూనిటీ:

నల్ల మిరియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడంలో దోహదపడతాయి. అంటువ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..నల్ల మిరియాల కాడా చేసుకుని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫలితంగా వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. నల్ల మిరియాల్లో ఉండే ఔషధ గుణాలు జలుబు, దగ్గు వంటి వ్యాధుల్ని దూరం చేస్తాయి. నల్ల మిరియాలు (Black Pepper) స్వభావరీత్యా వేడి కల్గిస్తాయి. మిరియాల టీ లేదా కాడా తాగడం వల్ల శరీరంలో వేడి పెరగడమే కాకుండా జలుబు తగ్గుతుంది.

బ్లడ్ ప్రెషర్ నియంత్రణ:

మిరియాలతో బ్లడ్ ప్రెషర్ కూడా నియంత్రించవచ్చు. మిరియాలను కిస్మిస్‌తో కలిపి తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంంత్రితమౌతుంది. మీకు హైబీపీ ఉంటే..మిరియాలు, కిస్మిస్ కలిపి తినడం లాభదాయకమౌతుంది.

మధుమేహం నియంత్రణ:

నల్ల మిరియాలు (Black Pepper) మధుమేహం నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మిరియాలతో చేసిన టీ..గ్లూకోజ్ నియంత్రించేందుకు పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ నియంత్రించవచ్చు.

Also Read:  Home Doorstep: మీ ఇంటి గుమ్మాన్ని ఇలా అలంకరించుకోండి