వేసవికాలంలో దొరికే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి తినడానికి కాస్త తియ్యగా,పుల్లగా,కాస్త వగరుగా కూడా ఉంటాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా కూడా ఈ నేరేడు పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. ఇవి ఎన్నో రకాల పోషకాలను నిండి ఉంటాయి. మరి ముఖ్యంగా మధుమేహం, హృద్రోగులకు నేరేడు పండ్లు చాలా మేలు చేస్తాయి.
గుండె సంబంధిత సమస్యలు, మధుమేహ రోగులు రక్తదానం చేయకూడదు. ఇది దాతకు శారీరక సమస్యలను కలిగిస్తుంది. అలాగే ప్రస్తుత రోజుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అలాంటి వారికీ నేరేడు పండ్లు దివ్య ఔషదం అని చెప్పాలి. ఈ నేరేడు పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి. నేరేడులో విటమిన్ సి అధిక స్థాయిలో ఉంటుంది.
ఫలితంగా ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే జలుబు, ఫ్లూ వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. వివిధ చర్మ సమస్యలలో కూడా నేరేడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దంతాలు, చిగుళ్ళ సమస్యలను నివారించడంలో నేరేడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి చిగుళ్ళను బలోపేతం చేయడానికి, నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడతాయి. కాబట్టి ఈ సీజన్ లో మాత్రమే లభించే ఈ నేరెడు పండ్లను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు.