Site icon HashtagU Telugu

Black Grapes: ఎండు నల్ల ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?

Dry Grapes 500x500

Dry Grapes 500x500

నల్ల ఎండు ద్రాక్ష గురించి మనందరికీ తెలిసిందే. నల్ల ఎండు ద్రాక్ష తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. నల్లటి ఎండు ద్రాక్ష శరీరంలో రక్త హీనతను తగ్గిస్తుంది. జట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, చక్కెర, ప్రొటీన్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు, ఐరన్ ఉన్నాయి.

రక్తపోటు, గుండె, కడుపు, ఎముకలు, చర్మం, జుట్టు సమస్యలను శీఘ్రంగా తగ్గిస్తుంది. నల్ల ఎండు ద్రాక్షలో లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. వీటివల్ల కంటికి ఎంతో ఆరోగ్యం. కంటిచూపును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రెటీనాకు ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తుంది. దీనివల్ల అకాలంగా వచ్చే అంధత్వాన్ని నివారించినట్లవుతుంది. ఐరన్, ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచడంలో సాయపడుతుంది. ఒక గిననె నీటిలో 10 నల్ల ఎండు ద్రాక్షలను నానబెట్టి దానికి కొద్దిగా నిమ్మరసం కలపాలి. నానబెట్టిన ద్రాక్షను దవడకేసి బాగా నమలాలి.

ఈ ప్రక్రియ రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచడంతోపాటు రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే రక్తం త్వరగా పెరిగేలా చూస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మధుమేహం బారిన పడుతున్నారు. నల్ల ఎండు ద్రాక్షలో స్టెరోస్టిల్బీన్ షుగరులో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. చర్మ సమస్యలను కూడా తగ్గించడంతోపాటు జట్టు రాలే సమస్యలకు చరమగీతం పాడుతుంది. పొటాసియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. గుండెను బలపరచడంతోపాటు సమస్యలను తగ్గిస్తుంది. ఎడు ద్రాక్షలోని రెస్ వెరాట్రాల్ భాగం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎక్కువగా ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.