మామూలుగా మనలో ఉదయం లేవగానే చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత కాఫీలు టీలు తాగనిదే చాలామంది పనులు కూడా మొదలుపెట్టరు. కొందరు ప్రత్యేకించి బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ అని తాగుతూ ఉంటారు. ముఖ్యంగా పరగడుపున తాగుతూ ఉంటారు. కానీ ఇలా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ పరగడుపున తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఉదయాన్నే బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగితే ఏం జరుగుతుందో ఇలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదయాన్నే బ్లాక్ టీ తాగడం వలన గ్యాస్టిక్ సమస్యలు వస్తాయట.. ఇది క్రమేపి వాత సమస్యను కలిగిస్తూ ఉంటుంది దాని ఆమ్ల ప్రభావం మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే బ్లాక్ టీలో తియోఫిలిన్ అనే పదార్థం ఉంటుంది ఇది శరీరంలోని డిహైడ్రేషన్ కి కారణం అవుతూ ఉంటుంది. దీనిని రోజు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుందట. బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఆమ్ల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన శరీరం యాసిడ్ ఆల్కలిన్ బ్యాలెన్స్ దెబ్బతీస్తుందని, ఇది రోజు గడుస్తున్న కొద్ది అజీర్తి పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. అలాగే బ్లాక్ టీ అలవాటు ఉన్న వాళ్ళకి మలబద్ధకం సమస్య కూడా వస్తుందట.
ఎందుకంటే తిన్న ఆహారం పేగులలో సరిగ్గా జీర్ణం అవ్వకపోతే మలవిసర్జన ప్రక్రియలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అలాగే ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగితే గ్యాస్టిక్ సమస్యలు ఎక్కువ అవుతాయట. ఇది క్రమేపి వాత సమస్యను కలిగిస్తూ ఉంటుందని, దాని ఆమ్ల ప్రభావం మూలంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది