కాకరకాయ అన్న పేరు వినగానే ముందుగా చేదు గుర్తుకు వస్తూ ఉంటుంది. చాలామంది కాకరకాయను అస్సలు తినడానికి ఇష్టపడరు. కానీ కొంతమంది మాత్రం కాకరకాయ కూరను లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. కాకరకాయ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇది చేదుగా ఉండడం చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కేవలం కాకరకాయ మాత్రమే కాకుండా కాకరకాయ విత్తనాలు వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి కాకరకాయ విత్తనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాకరకాయ విత్తనాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంచుతాయి. కాకరకాయ కాకరకాయ విత్తనాలు రెండు డయాబెటిస్ పేషెంట్స్ కి ఒక చక్కటి వరం అని చెప్పవచ్చు. కాకరకాయ తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అంతే కాకుండా కాకరకాయ విత్తనాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదాలను చాలా వరకు తగ్గిస్తాయి.
ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందన్న మాట. కాకరకాయ విత్తనాలు తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకున్న వారు కాకర గింజలను తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గవచ్చు. విటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
కొందరు కడుపులో తెల్లని చిన్న పురుగులతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు రోజుకు రెండుమూడు కాకరగింజలను తినడం వల్ల కడుపులో ఉండే పురుగులు చనిపోతాయి.