Site icon HashtagU Telugu

Bitter Gourd: కాకరకాయ జ్యూస్ వల్ల ఇన్ని లాభాలా.. వాళ్ళకి గొప్ప వరం!

Bitter Gourd

Bitter Gourd

కాకరకాయ జ్యూస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది కాకరకాయ పేరు వింటే చాలు వామ్మో చేదు అనేస్తూ ఉంటారు. కానీ కాకరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. ఇకపోతే ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయితే చాలా మందికి ఈ సమస్య ఉన్నట్టు ముదిరాక గుర్తిస్తున్నారు. కానీ ఈ టైంలో దీన్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు.

డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎక్కువ మొత్తంలో హెచ్చు తగ్గులు ఉంటే ఆరోగ్యం బాగా దెబ్బతింటుందట. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఊబకాయం, డయాబెటిస్ మూత్రపిండాల వైఫల్యం, ప్రాణాంతక గుండె జబ్బులు వంటి ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా డయాబెటిస్ పేషెంట్లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి మందులను, ఇన్సులిన్ ఇంజెక్షన్లను వాడుతుంటారు. కానీ వీటితో పాటుగా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, అప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఎన్నో ఫుడ్స్ ఉన్నాయని, ఇలాంటి వాటిని తింటే డయాబెటీస్ పేషెంట్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉంటుందట. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందట. ఇలాంటి వాటిలో కాకరకాయ కూడా ఒకటి. అవును డయాబెటీస్ పేషెంట్లకు కాకరకాయ జ్యూస్ ఒక వరంలా పనిచేస్తుందని చెబుతున్నారు. కాకరకాయ జ్యూస్ చేదుగానే ఉంటుంది.

కానీ ఇది డయాబెటీస్ ను కంట్రోల్ చేయడంలో ఒక టానిక్ లా పనిచేస్తుందట. దీనిలో కొన్ని యాంటీ డయాబెటిస్ లక్షణాలు కూడా ఉంటాయని చెబుతుంటారు. ఇలాంటి కాకరకాయ జ్యూస్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందట. కాకరకాయలో పాలీపెప్టైడ్ పి లేదా పి ఇన్సులిన్ అని పిలువబడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం కూడా ఉంటుందట. ఇది షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని, ఈ జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుందట. కాకరకాయ జ్యూస్ జీవక్రియను పెంచుతుందట.

గ్లూకోజ్ శోషణను నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అందుకే కాకరకాయ చూసిన తరచుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. కాగా కాకరకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఇతర పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడతాయట. డయాబెటిక్ రోగులు చాలా సార్లు ఆక్సీకరణ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కానీ ఈ ఆక్సీకరణ ఒత్తిడి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందట. కాకరకాయ జ్యూస్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయట. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుందట. ఇది డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిదని చెబుతున్నారు.