Bitter Cucumber: మధుమేహం ఉన్నవారు కీర దోసకాయ తినవచ్చా తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

మధుమేహం ఉన్నవారు కీర దోసకాయ తినవచ్చా తినకూడదా, ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Bitter Cucumber

Bitter Cucumber

మాములుగా మధుమేహం ఉన్నవారు ఆహార పదార్థాల విషయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో కీర దోసకాయ కూడా ఒకటి. అయితే షుగర్ సమస్య ఉన్నవారు కీరదోసకాయ తినవచ్చా లేదా ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దోసకాయ చేదుగా ఉందా లేదా అనేది పక్కన పెడితే, అది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందట.

ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే కొన్ని సహజ సమ్మేళనాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. అలాగే దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తినవచ్చని చెబుతున్నారు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుందట..చేదు దోసకాయలో చరాంటిన్, పాలీపెప్టైడ్ పి అనే సమ్మేళనాలు ఉంటాయట. ఈ సమ్మేళనాలు సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయట. ఇది కాకుండా అవి ఇన్సులిన్ లాగా పనిచేస్తాయట. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా నియంత్రిస్తాయట. కీరదోసకాయలో ఉండే సమ్మేళనాలు శరీరం గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తాయట.

దీని అర్థం మనం ఏ కార్బోహైడ్రేట్ తిన్నా, అది సరిగ్గా విచ్ఛిన్నమై శక్తిగా మారుతుందట. అదనపు చక్కెర రక్తంలో పేరుకుపోదట. డయాబెటిస్ రోగులు గుండె, మూత్రపిండాలు, కళ్ళకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడవచ్చట. దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడానికి పనిచేస్తాయట. ఇది డయాబెటిస్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుందట. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుందని, వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. మధుమేహ రోగులు కీర దోసకాయను అనేక విధాలుగా తినవచ్చని చెబుతున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగడానికి ప్రయోజనకరంగా ఉంటుందట. దీనితో పాటు, దీనిని కూరగా కూడా తినవచ్చని,గ్రిల్ చేయవచ్చు లేదా సూప్‌ లో చేర్చకోవచ్చని చెబుతున్నారు. అయితే మీరు దానిని సమతుల్య పరిమాణంలో తీసుకోవాలట.

  Last Updated: 22 Mar 2025, 07:24 PM IST