Nail Biting: మీకు కూడా గోర్లు కొరికే అలవాటు ఉందా.. అయితే జాగ్రత్త?

చాలామందికి ఉండే బాడ్ హ్యాబిట్స్ లో గోర్లు కొడకడం కూడా ఒకటి. కొంతమంది ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు మరికొందరు అనవసరంగా గోర్లు కొరుకుతూ ఉం

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 09:40 PM IST

చాలామందికి ఉండే బాడ్ హ్యాబిట్స్ లో గోర్లు కొడకడం కూడా ఒకటి. కొంతమంది ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు మరికొందరు అనవసరంగా గోర్లు కొరుకుతూ ఉంటారు. నిజానికి గోర్లు కొరకడం అన్నది నిజంగా ఒక చెడ్డ అలవాటు అని చెప్పవచ్చు. ఇలా గోర్లు కొరకడం అన్నది ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మంచిది కాదు. కొందరు టైం పాస్ కోసం కూడా గోర్లు కొరుకుతూ ఉంటారు. అది చెడ్డ అలవాటు అని తెలిసి కూడా చాలామంది మానుకోరు. ఒకవేళ మీకు కూడా గోర్లు కొరకే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. మరి గోర్లు కొరకడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గోరు కొరకడం వల్ల దంతాలు పగిలిపోవచ్చు. పళ్ల మీద ఉండే రూట్ తొలగిపోతుంది. దంతాల నష్టానికి కూడా దారి తీస్తుంది. దంతాలు దెబ్బతినడమే కాకుండా గోళ్లలో ఉండే బ్యాక్టీరియా నోటిలోకి చేరిపోతుంది. అవి శుభ్రంగా కనిపించనప్పటికీ కంటికి కనిపించని కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి రోగాల్ని వ్యాప్తి చేస్తాయి. గోళ్ళు కొరికినప్పుడు ఈ బ్యాక్టీరియా వేళ్ళ నుంచి నోట్లోకి వెళ్ళి పేగులకు వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన జీర్ణాశయాంతర ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. గోరు కొరికేవారికి బ్రక్సిజమ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే నిద్రలో పళ్ళు కొరికే అలవాటు వస్తుంది.

దీని వల్ల తలనొప్పి, ముఖం నొప్పి, చిగుళ్ళు వాపు, దంతాలు సున్నితత్వం, దంతాలు విరిగిపోవడం కూడా జరుగుతుంది. ఇవే కాదు నిద్రలో పళ్ళు కొరికే సమస్య వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అదే పనిగా గోళ్ళు కొరుక్కునే వ్యక్తులు పరోచినియా బారిన పడతారు. ఇది చేతి వేళ్ళపై ఇన్ఫెక్షన్, ఎరుపు, వాపు, చీముకు కారణమవుతుంది. శస్త్ర చికిత్స ద్వారా గోరు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు, యుక్త వయసు వాళ్ళు గోరు కొరకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొందరు గోర్లు పెరగకుండా ఉండడం కోసం అలా కొరుకుతూ ఉంటాము అని చెబుతూ ఉంటారు. అయితే అలా ఆలోచించేవారు గోర్లను కొరకడానికి బదులుగా నెయిల్ కట్టర్ సహాయంతో గోర్లను కత్తిరించుకోవడం మంచిది.