Layoffs: జాబ్ పోయిందా..స్ట్రెస్ నుంచి బయటపడే రూట్ ఇదీ..!

జాబ్ కట్స్ ఇటీవల కాలంలో పెరిగాయి. ఎంతోమంది సడెన్ గా జాబ్స్ కోల్పోతున్నారు. ఇలా జరిగినప్పుడు ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. తమలో తాము కుమిలి పోతుంటారు. తమకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఏడుస్తారు. వీటితోనే సరిపెట్టుకుంటే.. జీవితంలో ముందడుగు వేయలేరని మానసిక నిపుణులు చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 10, 2023 / 02:22 PM IST

జాబ్ కట్స్ ఇటీవల కాలంలో పెరిగాయి. ఎంతోమంది సడెన్ గా జాబ్స్ కోల్పోతున్నారు. ఇలా జరిగినప్పుడు ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. తమలో తాము కుమిలి పోతుంటారు. తమకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఏడుస్తారు. వీటితోనే సరిపెట్టుకుంటే.. జీవితంలో ముందడుగు వేయలేరని మానసిక నిపుణులు చెబుతున్నారు. గతాన్ని తలుచుకొని టైం వేస్ట్ చేసుకోవడం కంటే.. భవిష్యత్ కోసం ప్లానింగ్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇంకా వారు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..!

జాబ్ కోల్పోయినప్పుడు మానసిక ఆందోళన, ఒత్తిడి, నిరాశ ఆవరిస్తాయి. భావోద్వేగాలు టచ్ చేస్తాయి. అయినా వెనక్కి తగ్గొద్దు. ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా మిమ్మల్ని మీరు బయట పడేయాలో ఆలోచించండి. జీవితంలో ఏదో కోల్పోయాం..అనే ఆలోచన రానివ్వొద్దు. మరో గొప్ప అవకాశం మరో చోట మీకోసం ఎదురు చూస్తోందని గుర్తు పెట్టుకోండి. జాబ్ కట్ వల్ల పెరిగే స్ట్రెస్ ప్రభావం మీ ప్రవర్తన పై పడేలా చేయకండి. అందరితో ఇంతకు ముందు లాగే బాగా ఉండండి. చిరాకు పడకండి. విసుక్కోకండి.

Also Read: Which Oil Best For Heart: గుండె హెల్త్ కు.. ఏ ఆయిల్ బెస్ట్..?

■ ఈ విషయాలు గుర్తుంచుకుంటే ఇక తిరుగు ఉండదు

★ జాబ్ కట్ అనేది మీ ఒక్కరిని టార్గెట్ చేసి చేయలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎంతోమందిని తీశారు.. వారిలో మీరు కూడా ఒకరు మాత్రమే.

★ మీరు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకోండి. గతంలో నిరాశలో కూరుకుపోయినప్పుడు.. వాటి నుంచి బయటకు వచ్చిన సందర్భాలను నెమరు వేసుకోండి.

★ ఇది క్లిష్ట పరిస్థితి అని గుర్తించి, మీరు అనుభవిస్తున్న భావోద్వేగాలను అంగీకరించండి.  ఈ అనుభవాలను మీ దగ్గరి వారితో మనసు విప్పి పంచుకోండి. తద్వారా అవి మీ ఆలోచనను మళ్లీ టార్గెట్ పై కేంద్రీకరించడంలో సహాయపడతాయి. కష్టమైన క్షణాల్లో మీ ఆలోచన విధానాన్ని పాజిటివ్ రూట్ లో ఉంచడానికి మీకు హెల్ప్ చేస్తాయి.

★ ఇతరులతో మిమ్మల్ని పోల్చి చూసుకోవద్దు. ఎవరి కష్టాలు వారివి.. ఎవరి సామర్థ్యం వారికి.. అని తెలుసుకోండి.

★ జాబ్ మళ్లీ సంపాదించేందుకు ఉన్న అవకాశాలను గుర్తించండి. ఇందుకోసం మీ పరిచయస్తులను కాంటాక్ట్ చేయండి. మీ స్కిల్స్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వండి.

★ మీకు ఏవైనా స్కిల్స్ తక్కువగా ఉంటే.. తెలిసిన వారి ద్వారా ఆ స్కిల్స్, సర్టిఫికేషన్స్ పెంచుకునే ఏర్పాటు చేసుకోండి.

★ ఒత్తిడి వల్ల మీ ఆలోచనా శక్తి నశిస్తుంది. పాజిటివ్ నెస్ వల్ల మీ ఆలోచనలో పదును పెరుగుతుంది. క్రియేటివ్ ఆలోచనలు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్స్ అందిస్తాయి.