Nasal Covid Vaccine: భారత్ బయోటెక్ “ముక్కు టీకా” ప్రయోగ పరీక్షలు పూర్తి

హైదరాబాద్ కు చెందిన " భారత్ బయోటెక్" మరో ముందడుగు వేసింది.

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 10:39 AM IST

హైదరాబాద్ కు చెందిన ” భారత్ బయోటెక్” మరో ముందడుగు వేసింది. ఆ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్-19 ముక్కు వ్యాక్సిన్ తో ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. ఈవిషయాన్ని భారత్ బయో టెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు.

ప్రయోగ పరీక్షల ఫలితాలను ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని, ఆ వివరాలను త్వరలోనే ఔషధ నియంత్రణ సంస్థలకు సమర్పిస్తామని తెలిపారు. త్వరలోనే తమ ముక్కు వ్యాక్సిన్ కు ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే తొలి క్లినికల్లీ ప్రూవెన్ వ్యాక్సిన్ గా ఇది నిలుస్తుందని చెప్పారు.

కరోనా వైరస్ ప్రధానంగా మనుషుల శరీరంలోకి ముక్కు మార్గం ద్వారా ప్రవేశిస్తోంది. ముక్కు వ్యాక్సిన్ .. ముక్కు మార్గంలోని శ్లేష్మ పొర లో ఉండే యాంటీ బాడీలను చైతన్యపరుస్తుంది. ఇవి ముక్కులోకి కరోనా వైరస్ అడుగిడిన వెంటనే.. దాన్ని అంతం చేస్తాయి. కొత్తగా కరోనా ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షణ కల్పించడంతో పాటు ఇప్పటికే సోకిన ఇన్ఫెక్షన్ ను తగ్గించేందుకు కూడా ముక్కు టీకా ఉపయోగపడుతుంది.