Kidney Care:వీటితో మీ కిడ్నీలకు ప్రమాదం..జాగ్రత్త..!

మానవశరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఈ మూత్రపిండాలు రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి. సోడియం, పొటాషియం, కాల్షియం వంటి రసాయనాల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి.

  • Written By:
  • Publish Date - March 9, 2022 / 02:20 PM IST

మానవశరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఈ మూత్రపిండాలు రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి. సోడియం, పొటాషియం, కాల్షియం వంటి రసాయనాల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. అంతేకాదు అదనంగా కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఎముక మజ్జలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.

ఇలాంటి కీలకమైన పనులను చేసే కిడ్నీలు కొన్నిసార్లు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. చెడు ఆహారపు అలవాట్లు, డ్రగ్స్, వాతావరణంలోని టాక్సిన్స్ వల్ల కిడ్నీలు దారుణంగా దెబ్బతింటాయని వైద్య నిపుణలు చెబుతున్నారు. కిడ్నీలోస్టోన్స్, కిడ్నీ క్యాన్సర్, పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుందని అంటున్నారు. సమస్య ముదిరినాకొద్దీ కొన్ని సార్లు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందంటున్నారు. కాబట్టి మూత్రపిండాలకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మీరు రోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధం చూపించాలి. ఎందుకంటే మనం రోజూ తినే కొన్ని ఆహార పదార్థాలు డైరెక్టుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి.

మూత్రపిండాలను నేరుగా దెబ్బతీసే కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

శరీరంలో కిడ్నీల పనితీరు ఏమిటి?
శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపే పనిని కిడ్నీలు నిర్వహిస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీన్ని ముందుగానే గుర్తించి…ఆహారంలో మార్పులు చేసుకోవాలి. కానీ కొందరికీ మూత్రపిండాల సమస్య ముదిరిన దశలోనే బయటపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారు ఆహారం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

కిడ్నీల వైఫల్యం…ప్రారంభ సంకేతాలు..
శరీరం వాపు, చర్మం దురద, మూత్ర విసర్జన చేయడం ఇబ్బంది, చికాకు, శీతలీకరణ అనుభూతి, అనోరెక్సియా ఇవన్నీ కూడా కిడ్నీలు వైఫ్యలం చెందాయని చెప్పడానికి ప్రారంభ సంకేతాలు.

కిడ్నీలను దెబ్బతీసే ఆహార పదార్థాలు..
ఆల్కాహాల్ అతిగా సేవించడం వల్ల కిడ్నీలు దారుణంగా దెబ్బతింటాయి. ఇది కిడ్నీల పనితీరులో సమస్యలను కలిగిస్తుంది. మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపడమే కాదు…ఇతర అవయవాలకు కూడా నష్టం కలిగిస్తుంది.

కాఫీ..
కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అధిక కెఫిన్ తీసుకుంటే…దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిపై హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. అదేవిధంగా కాఫీ ఎక్కువగా తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాఫీని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.
ఉప్పు..
ఇందులోసోడియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియంతో పాటు శరీరంలోని ద్రవాన్ని నిర్వహిస్తుంది. కానీ మీ ఆహారంలో అధికమొత్తంలో ఉప్పును చేర్చినట్లయితే…అది ద్రవం మొత్తాన్ని పెంచుతుంది. దీంతో కిడ్నీలపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలా నిరంతరం కిడ్నీలు ఎక్కువ ఒత్తిడికి లోనవడంతో…డ్యామేజ్ అవుతాయి.
రెడ్ మీట్..
ఇందులో ప్రోటన్స్ ఎక్కువ మొత్తంలోఉంటాయి. కండరాల పెరుగుదలకు ఈ ప్రొటీన్ చాలా అవసరం. కానీ దాని జీవక్రియ అనేది చాలా కష్టం. ఇది కిడ్నీలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రొటీన్స్ ఎక్కువగా లభించే రెడ్ మీట్ వంటి ఆహారం తీసుకోవడం ల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆర్టిఫిషల్ సాస్….
సాస్ లను డెజర్ట్ లు, కుకీలు, ప్రస్తుతం స్టోర్లలో విక్రయించే పానీయాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ కృత్రిమ సాస్ లు మూత్రపిండాల ఆరోగ్యానికి హానికరం. షుగర్ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు ఇలాంటి ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.