Site icon HashtagU Telugu

Health Tips: ఏంటి రాత్రిపూట బ్రష్ చేయకపోతే గుండెపోటు వస్తుందా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు!

Health Tips

Health Tips

మామూలుగా ప్రతి ఒక్కరు నిద్ర లేవగానే ఉదయం చేసే పని బ్రష్ చేసుకోవడం. బ్రష్ చేసుకున్న తర్వాత తినడం తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. బ్రష్ చేసుకోకపోతే అనేక రకాల సమస్యలు రావడంతో పాటు నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. దాంతో నలుగురితో మాట్లాడాలి అన్న కూడా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా బ్రష్ చేయకపోవడం వల్ల నోటికి సంబంధించిన అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. అయితే చాలా వరకు రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రష్ చేస్తూ ఉంటారు. కానీ వైద్యుల మాత్రం ప్రతిరోజూ ఉదయం రాత్రి అలాగే పడుకునే ముందు బ్రష్ చేయమని చెబుతూ ఉంటారు.

రాత్రిపూట బ్రష్ చేయడం వల్ల నోరు దుర్వాసన రాదు. అలాగే దంతాలు స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి అని చెబుతున్నారు. అయితే బ్రష్ చేయకపోతే గుండెపోటు వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో బ్రష్ చేయకపోతే గుండెపోటు సమస్యలు వస్తాయట. ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రిపూట పళ్ళు తోముకోని వ్యక్తులకు ప్రాణాంతక గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందట. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకునే వారి కంటే గుండెపోటుతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంది. గుండెపోటు సాధారణంగా గుండెకు దారితీసే రక్తనాళాలలో ఫలకాలు లేదా కొవ్వు పొరలు పేరుకుపోవడం, గుండెను అడ్డుకోవడం రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించడం వల్ల సంభవిస్తుంది. గుండె ధమనులలోని ఫలకాలు విచ్ఛిన్నమైన తర్వాత, రక్తనాళాల్లోని జిగట కొవ్వులు బయటకు వస్తాయి.

ప్లేట్‌లెట్లను ఆకర్షిస్తాయి. అలాగే రక్తం గడ్డకట్టడాన్ని ప్రేరేపిస్తాయి. ఈ క్లాట్ ఏర్పడినప్పుడు, ఇది ధమనిని అడ్డుకుంటుంది. రక్తం ముందుకు కదలకుండా చేస్తుంది. ఆ ధమనికి అనుసంధానించబడిన గుండె భాగం చనిపోవడం ప్రారంభమవుతుంది. పేలవమైన నోటి పరిశుభ్రత అనేక విధాలుగా దీనికి కారణం కావచ్చు. సరికాని టూత్ బ్రషింగ్ దంతక్షయాన్ని కలిగిస్తుందట. పోషకాల తీసుకోవడంపై ప్రభావం చూపుతుందట. రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోకపోవడం వల్ల జీర్ణాశయంలోని మంచి, చెడు బ్యాక్టీరియాలో అసమతుల్యత ఏర్పడి మంట, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందట. దంతాల మీద ఫలకం వల్ల చిగుళ్ల వ్యాధి, శరీరంలో దీర్ఘకాలిక మంట వస్తుంది. ఈ వాపు ఆవర్తన స్నాయువు అల్వియోలార్ ఎముకతో సహా సహాయక కణజాలాల నాశనానికి దారితీస్తుంది. చిగురువాపుకు కారణమయ్యే అదే బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధికి దారితీస్తుందట. గట్ బ్యాక్టీరియాలో అసమతుల్యత దీర్ఘకాలిక మంటలు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోని వ్యక్తులలో గుండెపోటుతో మరణించే అవకాశాన్ని పెంచుతాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం సాయంత్రం దంతాలు శుభ్రం చేసుకోవడం మంచిది..