Site icon HashtagU Telugu

Chapati: చపాతీని ఉదయం, రాత్రి ఎప్పుడు తినాలి.. ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది తెలుసా?

Mixcollage 01 Dec 2023 05 17 Pm 248

Mixcollage 01 Dec 2023 05 17 Pm 248

ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా చపాతీలను తినడానికి ఇష్టపడుతున్నారు. అందుకు గల కారణం కొందరు అధిక బరువు ఉన్నవారు రాత్రి సమయంలో చపాతి తింటే, షుగర్ ఉన్న వారు రాత్రి సమయంలో చపాతీలు తింటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం సమయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చపాతీలను తింటూ ఉంటారు. అంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అయితే నిజానికి చపాతిని ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చపాతీలో చాలా క్యాలరీల శక్తి ఉంటుంది. అలాగే అందులో పిండి పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో చపాతీలు తినడం వల్ల అది అధిక బరువుకు దారితీస్తుందని అంటున్నారు వైద్యులు. అలాగే షుగర్ లెవెల్స్ కారణంగా శరీరంలో చక్కెర లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కావున రాత్రి చపాతి తీసుకోవడం వలన అంత మంచిది కాదట. ఒక చిన్న చపాతీలో 71 క్యాలరీల శక్తి ఉంటుంది. రాత్రి భోజనం రెండు రోటీలు తింటే 140 క్యాలరీల శక్తి శరీరానికి అందుతుంది. అయితే చపాతితో పాటు కూరగాయల సలాడ్ కూడా తీసుకుంటూ ఉంటారు. దాని వలన శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా చేరుతాయి. దీని మూలంగా బరువు వేగంగా పెరుగుతూ ఉంటారు.

ఇక రాత్రి తిన్న తర్వాత నడవకపోతే బరువు అధికంగా పెరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదయం వేళ చపాతి తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ రాత్రి సమయంలో చపాతి తిన్నా కూడా రెండు కంటే ఎక్కువ తీసుకోకూడదు. రాత్రి సమయంలో చపాతి బదులుగా పండ్లు పీచు పదార్థాలు తీసుకోవడం మంచిది. మధుమేహం పీసీఓడీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జీర్ణ క్రియను దెబ్బతీస్తుంది. రాత్రి సమయం చపాతీ తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి చపాతీ ఉదయం తినాలా రాత్రి తినాలా అని సందేహపడే వారికి వైద్యులు ఉదయమే తినమని చెబుతున్నారు.