Site icon HashtagU Telugu

Betel Leaf: భోజనం తర్వాత తమలపాకులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

Mixcollage 09 Feb 2024 09 02 Pm 6607

Mixcollage 09 Feb 2024 09 02 Pm 6607

తమలపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ తమలపాకులను ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక నిత్యం తమలపాకులను పాన్, పాన్ బీడా వంటి వాటి ద్వారా తీసుకుంటూ ఉంటాం. చాలామందికి భోజనం చేసిన తర్వాత తమలపాకును తీసుకోవడం అలవాటు. ముఖ్యంగా మసాలా ఐటమ్స్ వంటివి తిన్నప్పుడు పెళ్లిళ్లకు శుభకార్లకు వెళ్ళినప్పుడు లాస్ట్ లో కచ్చితంగా పాన్ వంటివి ఇస్తూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

ఈ తమలపాకులో క్యాల్షియం ఐరన్ మాంగనీస్ విటమిన్ అనేక పోషకాలు కూడా ఉన్నాయి. ఈ తమలపాకు శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి మెరుగుపరచడానికి కడుపు పేగుల్లో పీహెచ్ స్థాయిలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడతాయి. కడుపునొప్పి నుండి కూడా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తమలపాకులు తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మీరు కడపు సమస్యలు ఉంటే ఖాళీ కడుపుతో తమలపాకు తింటే మంచిది. ప్రతి రోజు ఉదయాన్నే తమలపాకులు తినడం వల్ల పోషకాల్ లోపాలు దూరం చేసుకోవచ్చు. చాతి ఊపిరితిత్తులు ఆస్తమాతో బాధపడే వారికి తమలపాకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

తమలపాకులపై కొద్దిగా ఆవాల నూనె రాసి వేడి చేసి చాతిపై ఉంచితే గుండె నొప్పి సమస్యల నుంచి బయటపడవచ్చు. తమలపాకుల్లో క్రిమినహాస గుణాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులు తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారుకి ఉపశమనం లభిస్తుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గించు సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటాయని ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. తమలపాకు ఒక శక్తివంతమైన యాంటీబయోటిక్ లా ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో గ్లూకోస్ ను అదుపు చేయకపోవడం వల్ల కలిగే మంటను కూడా నివారిస్తుంది..