Site icon HashtagU Telugu

‎Banana: అరటిపండు ఎప్పుడు తింటే మంచిది ఉదయమా లేక రాత్రినా!

Banana (2)

Banana (2)

‎Banana: తక్కువ ధరకే లభించే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండు సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. కాగా వీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్లను తినడం వల్ల శరీరానికి మంచి శక్తి అందడం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చట. జిమ్ లో వర్కౌట్స్ చేసేవారికి శక్తి ఎక్కువగా అవసరమవుతుంది.

‎ కాబట్టి ఇలాంటి వారు ఉదయాన్నే వర్కౌట్ చేయడానికి ముందే తినడం మంచిదని చెబుతున్నారు. అరటిపండును తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుందట. అలాగే ఇవి చాలా తొందరగా జీర్ణం అవుతాయని చెబుతున్నారు. అదేవిధంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండును తినడం కూడా మంచిదే అని చెబుతున్నారు. దీనివల్ల కడుపు తొందరగా నిండుతుందట. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని చెబుతున్నారు. అరటిపండ్లలో విటమిన్ బి6, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి జీవక్రియను పెంచడానికి, ఇమ్యూనిటీ పవర్ ను మెరుగుపరచడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

‎భోజనానికి అర్థగంట ముందు అరటిపండుని తింటే మీకు ఎక్కువ ఆకలి కాకుండా ఉంటుందని, ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో అరటిపండును చిరుతిండిగా తినవచ్చట. ఇది మీరు రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడుతుందట. అలాగే దీనిలో మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి మీరు రాత్రిళ్లు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుందట. అయితే అరటిపండ్లను ఎప్పుడు తినకూడదు అన్న విషయానికి.. రాత్రిపూట పడుకునే ముందు అరటిపండ్లను తినకూడదట. ఎందుకంటే దీనివల్ల శ్లేష్మం ఏర్పడుతుందని, దీంతో జీర్ణక్రియ మందగిస్తుందని చెబుతున్నారు. అలాగే నైట్ అరటిపండ్లను తింటే రాత్రి మీరు సరిగ్గా నిద్రపోలేరట. ఇవి మీ నిద్రకు భంగం కలిగిస్తాయని చెబుతున్నారు.

Exit mobile version