Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ ఆకుకూరలు తినాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆడ మగ అని తేడా లేకుండా చాలామంది ఈ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 05:15 PM IST

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆడ మగ అని తేడా లేకుండా చాలామంది ఈ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగించినప్పటికీ ఫలితం లేక చాలా మంది నిరాశపడుతూ ఉంటారు. బరువును తగ్గించుకోవడానికి ఆకుకూరలు ఎంతో బాగా ఉపయోగపడతాయి అంటున్నారు వైద్యులు. బరువు తగ్గాలి అనుకున్న వారు ప్రతి రోజు వారి డైట్ లో ఆకు కూరులు చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆకు కూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ఆకు కూరలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి బరువు తగ్గాలంటే ఆకు కూరలను ఏ విధంగా తీసుకోవాలో ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడు అయినా కూడా ఆకుకూరలు ఉడికించేటప్పుడు వాటి పోషకాలు తొలగిపోకుండా చూసుకోవాలి. నీటిలో ఉడికిస్తే ఆ నీటిని పారబోయకూడదు. ఆకుకూరలను ఉడికించడానికి ఉత్తమమైన పద్ధతి ఆవిరపై ఉడికించడం. ఇలా ఉడికించడం వల్ల ఆకుకూరల్లోని పోషకాలు తొలగిపోకుండా ఉంటాయి. స్టైర్ ఫ్రైయింగ్ పద్ధతి కూడా మంచిదే. ఆకుకూరల నుండి పూర్తి స్థాయిలో పోషకాలు అందుకోవడానికి స్మూతీస్ గొప్ప మార్గం.

మీకిష్టమైన ఆకుకూరలను బ్లెండర్ లో కొన్ని పండ్లు, పెరుగు, పాలు కలిపి స్మూతీస్ గా తయారు చేసుకుని తీసుకుంటే రుచిగా ఉండటంతో పాటు ఆకుకూరల్లోని పోషకాలు శరీరానికి అందుతాయి. సలాడ్స్ లో కూడా ఆకుకూరలు జోడించుకోవచ్చు. బచ్చలికూర, కాలే, పాలకూర లాంటివి సలాడ్‌లకు జోడిస్తే బాగుంటాయి. ఈ సలాడ్స్ లో పండ్లు, గింజలు, విత్తనాలు, స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలతో సూప్‌లు కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తీసుకోవడం కూడా చాలా సులభం. భోజనం చేసే ముందు లేదా తర్వాత ఆకుకూరలతో చేసిన సూప్‌లు తీసుకోవచ్చు.అలాగే శాండ్‌విచ్‌లలో, బర్గర్ల మధ్యలో ఆవిరిపై ఉడికించిన ఆకుకూరలు, లేదంటే పచ్చివి కూడా పెట్టుకుని తినవచ్చు. దీని వల్ల ఆకుకూరల్లోని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఈ మార్గాల్లో ఆకుకూరలను రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలు తింటే అందులోని పోషకాలు సమృద్ధిగా అందడంతో పాటు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.