Site icon HashtagU Telugu

Weight Lose: మొలకత్తిన పెసలు ఏ సమయంలో తింటే బరువు తగ్గవచ్చో తెలుసా?

Weight Lose

Weight Lose

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆహారంలో భాగంగా మొలకెత్తిన గింజలను చేర్చుకుంటూ ఉంటారు. అయితే మొలకెత్తిన గింజలు తినడం మంచిదే కానీ ఏ సమయంలో తింటే బరువు తగ్గుతారు అన్న విషయంపై చాలామందికి సరైన అవగాహన లేదు. మరి మొలకెత్తిన గింజలను ఏ సమయంలో తింటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ​పెసర పప్పు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందట.

ఎందుకంటే పెసర పప్పులో తక్కువ కేలరీలు ఉంటాయట. దీంతో పెసలు తినడం వల్ల శరీర బరువు పెరగదు. అంతేకాకుండా పెసల్లో ఉండే ప్రోటీన్, ఇతర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే పెసర పప్పులో మంచి మొత్తంలో ఫైబర్ కనిపిస్తుందట. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అంతేకాకుండా బరువును నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. బరువు తగ్గడానికి మొలకెత్తిన పెసర పప్పు తినడం ప్రయోజనకరంగా ఉంటుందట. అయితే ఇందుకోసం ముందుగా పెసర పప్పును బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక పాత్రలో గుప్పెడు పెసర పప్పు తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి 6 నుంచి 8 గంటలు నీటిలో నాన బెట్టాలి.

పెసరపప్పును 6 నుంచి 8 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత దానిని వడకట్టి వాటి నుంచి పూర్తిగా నీటిని తొలగించాలట. ఇప్పుడు పెసరపప్పును వేరు చేసి ఒక పాత్రలో ఉంచాలట. ఆ తర్వాత పెసర పప్పును శుభ్రమైన కాటన్ బట్టలో ఉంచి దానిని కప్పాలి. ఈ సమయంలో పెసర పప్పు మొలకెత్తే ప్రక్రియ ప్రారంభమవుతుందట. పెసర పప్పులో చిన్న మొలకలు కనిపిస్తే అవి తినడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. మొలకెత్తిన పెసర పప్పును మీరు డైరెక్ట్‌గా తినవచ్చట. లేదా వాటికి నిమ్మరసం, నల్ల ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసి సలాడ్‌ లా కూడా తినవచ్చని చెబుతున్నారు. కాగా మొలకెత్తిన పెసర పప్పులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయట. అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుందట. మొలకెత్తిన పెసర పప్పు తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుందని, అతిగా తినాలనే కోరిక తగ్గుతుందని ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

అలాగే మొలకెత్తిన పెసర పప్పు జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌ లతో నిండి ఉంటుందట. ఇది మలబద్దకం, అజీర్ణం, కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. కాగా ఈ మొలకెత్తిన పెసర పప్పును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిది. ఇలా చేస్తే రోజు ప్రారంభంలో శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. శరీరం ఫుల్ యాక్టివ్‌ గా ఉంటుందట. మొలకెత్తిన పెసర పప్పు మంచి ప్రోటీన్ మూలం. ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుందట. ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుందని, బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. కాగా మొలకెత్తిన పెసర పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందట. దీంతో పాటు సమతుల్య ఆహారం కూడా ముఖ్యం అని చెబుతున్నారు. వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు కూడా చేయాలని చెబుతున్నారు.