Site icon HashtagU Telugu

Water: మంచినీరు తాగితే బరువు తగ్గుతారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 25 Jul 2024 11 07 Am 6569

Mixcollage 25 Jul 2024 11 07 Am 6569

ప్రస్తుత రోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల డైట్లు ఫాలో అవ్వడంతో పాటు, ఎక్సర్సైజులు చేయడం, జిమ్ కి వెళ్లడం లాంటివి చేస్తుంటారు. అయితే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బరువు తగ్గడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. కొందరు వంటింటి చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కేవలం మంచినీళ్లు తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు అని అంటున్నారు వైద్యులు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే మంచి నీటిని తాగితే బరువు తగ్గుతారట. మరి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నీరు ఎక్కువగా తాగడం వల్ల మన బాడీకి మంచి హైడ్రేషన్ లభిస్తుంది. అంతేకాదు ఇది మన వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా సహాయపడుతుందట. అయితే మీరు బరువు తగ్గాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం టీ కాఫీలకు బదులుగా నీరు తాగడం మంచిది. గోరు వెచ్చని నీరు ఇంకా మంచిది. అలాగే నిమ్మకాయ నీరు కొత్తిమీర నీటిని కూడా మన డైలీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయట. ఇవి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. అలాగే మీరు తినడానికి అర్ధగంట ముందు నీరు తాగడం మంచిది అని చెబుతున్నారు. ఇది మీ కడుపుని నింపుతుంది.

దీనివల్ల మీరు తక్కువ కేలరీలు వినియోగిస్తారు. అలాగే ప్రతి భోజనానికి ముందు కొంచెం నీరు త్రాగాలి. ఈ మార్గం బరువు తగ్గడానికి మీకు బాగా సహాయపడుతుంది. అదేవిధంగా సరైన సమయంలో , తగినంత పరిమాణంలో ఆహారం తీసుకున్న తర్వాత కూడా మీకు ఆకలి అనిపిస్తే, ఆహారం తినడానికి బదులుగా ఒక గ్లాసు నీరు త్రాగాలట. ఇది మీ ఆకలిని నియంత్రిస్తుందని చెబుతున్నారు. కాగా నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయని మీకు తెలియజేద్దాం. ఇది కాకుండా, ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. మీ జీవక్రియను పెంచినప్పుడు, కొవ్వు కూడా వేగంగా కాలిపోతుంది. ఈ రకంగా వాటర్ తాగితే మీరు ఈజీగా బరువు తగ్గవచ్చు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Exit mobile version